నేటి కాలంలో మహిళలకు భద్రత లేకుండా పోతుంది. చిన్నపిల్లలు, ముసలివారు అని తేడా లేకుండా మగవాళ్ళు వికృతమైన చేష్టలు చేస్తున్నారు. ఎన్నో రకాల చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ కొంతమంది ఏమాత్రం భయపడకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా విశాఖ జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మూగ బాలికపై ఇద్దరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇతరు యువకులు మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అఘాయిత్యం చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురిపై అఘాయిత్యం జరిగిందని కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై CP శంఖబ్రత భాగ్చీ ఫైర్ అయ్యారు. వెంటనే ఈ విషయం పైన పూర్తి వివరాలు సేకరించాలని పోలీసులను కోరారు. విచారణలో మద్యం మత్తులో యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. బాలిక కుటుంబ సభ్యులు తమ కూతురికి న్యాయం జరగాలని పోలీసులను వేడుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.