పాకిస్థాన్‌లోని లాహోర్‌లో బసులి హనుమాన్ మందిర్‌ను పబ్లిక్ టాయిలెట్‌గా మార్చారు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి ఎంతో మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ పిచ్చికి ఇది పరాకాష్టగా మారిందని నెటిజన్లు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలోని చారిత్రాత్మక అనార్కలి నడిబొడ్డున పసులి హనుమాన్ మందిర్ అని పిలువబడే హనుమాన్ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని బన్సి మందిర్ అని కూడా అంటారు. 20వ శతాబ్దం ప్రారంభంలో సంపన్నమైన హిందూ కుటుంబంచే నిర్మించబడిన ఈ ఆలయం 1947లో భారతదేశం-పాకిస్తాన్ విభజన సమయంలో వదిలివేయబడింది.
ఆలయాన్ని ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్‌గా మార్చినట్లు చూపించే షాకింగ్ వీడియో బయటపడింది. హనుమాన్ దేవాలయం యొక్క పవిత్రతను మరియు చారిత్రక ప్రాముఖ్యతను పాడుచేస్తూ ఆలయ హాళ్లలో ఆరు టాయిలెట్లను నిర్మించారు. ఇది హిందువుల మత విశ్వాసాన్ని కించపరిచే చర్య అని వివాదం రేగింది.
తరతరాలుగా హిందువులు గౌరవించే పురాతన ప్రార్థనా స్థలం, పాకిస్తాన్‌లోని మతపరమైన మైనారిటీలు ఎదుర్కొంటున్న సవాళ్లను చూపుతున్నందుకు విమర్శించబడింది. పాకిస్తాన్ సరిహద్దులు దాటి, పసులి హనుమాన్ మందిర్ యొక్క దుస్థితి మత స్వేచ్ఛ మరియు మైనారిటీ హక్కుల గురించి సంభాషణలను రేకెత్తించింది. ఈ వీడియోకు ఇప్పటికే 32.8k వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది రీపోస్ట్ చేశారు. ఈ విషయం ఇప్పుడు బహిర్గతం కావడంతో ఇప్పటికైనా ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.