గుడ్‌ టచ్ బ్యాడ్‌ టచ్‌ అంటే ఏంటో పిల్లలకు నేర్పించారా..?

-

పాఠశాలల్లో బోధించాల్సిన ముఖ్యమైన సబ్జెక్టుల్లో గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ కూడా ఒకటి. స్పర్శ ఎలాంటి ప్రభావం చూపుతుంది? పిల్లలు ఎవరితో ఎలా ప్రవర్తించాలి? ఎవరైనా తమతో అనుచితంగా ప్రవర్తిస్తే ఏం చేయాలో వారికి తెలియజేయడం ముఖ్యం. ప్రతి పాఠశాలలో పిల్లలకు దీని గురించి తెలియజేయడం ముఖ్యం. చిన్నారులపై లైంగిక దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఏది మంచి ఏది చెడు తెలియని వయసు వారిది.. లైంగికదాడుల్లో నిందుతులు చాలా వరకూ కుటుంబసభ్యులు, పిల్లలకు బాగా తెలిసిన వాళ్లే ఉంటున్నారు. అరే మన అన్నే కదా, బాబ్బై ఏ కదా అని పిల్లలు వారి దగ్గరకు వెళ్తారు.. కానీ కొందరు అభంశుభం తెలియని చిన్నారులగై తమ లైంగిక కోరికలను తీర్చుకుంటున్నారు. అందుకే పిల్లలకు గుడ్ టచ్‌ బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కచ్చితంగా ఉండాలి.

చిన్నతనంలో పిల్లలపై వేధింపుల గురించి మనం చాలా విన్నాం. ప్రతిరోజూ ఇలాంటి ఉదంతాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి దానిపై కూడా అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. దీన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఎంచుకుని పిల్లలకు సమాచారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రాథమిక దశలో శరీర భాగాల గురించి సరైన సమాచారం ఇవ్వాలి. పిల్లలు దేనిపైనా అతిగా ఆసక్తిని పెంచుకోవద్దు.అన్ని విషయాల గురించి ఓపెన్ గా మాట్లాడండి. మరియు సమాచారాన్ని పంచుకోండి. పిల్లల కుటుంబానికి చెందిన సన్నిహితులు, బంధువులు లేదా కుటుంబ సభ్యులు చిన్నారిపై ఇలాంటి హింసకు పాల్పడ్డారు. అలాంటి వ్యక్తులు ఇంటికి వచ్చిన వెంటనే, పిల్లవాడు చిరాకుగా అనిపించవచ్చు లేదా అక్కడ నుండి దూరంగా వెళ్లడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ బిడ్డ అలాంటి ప్రవర్తనను ఎప్పుడు చూపిస్తుందో నిశితంగా గమనించండి. దీని గురించి పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడండి. మీ అనుమానాలు నిజమైతే, వారు ఎంత సన్నిహితంగా ఉన్నా వారితో సంబంధాలు తెంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే బిడ్డకు తల్లి కవచం అని గుర్తుంచుకోండి.

తల్లి..పిల్లలకు శరీరంలో ప్రైవేట్‌ భాగాలు అంటే ఏంటో చెప్పాలి. వాటిని తల్లి తప్ప వేరే ఏ వ్యక్తి తాకినా.. గట్టిగా అరవాలి, అక్కడి నుంచి వచ్చేయాలి అని స్పష్టంగా చెప్పాలి. ఇలాంటి విషయాలు చిన్నపిల్లలకు చెప్పడం కాస్త కష్టమే.. మీరు బొమ్మ సాయంతో చూపిస్తూ వాటిని నేర్పించండి. పొరపాటున తాకితే ఎలా ఉంటుంది, కావాలని తాకితే ఎలా ఉంటుందో కూడా తల్లి పిల్లలకు అవగాహన కల్పించాలి. అప్పుడే వారికి బాగా అర్థమవుతుంది. కాలం మారింది, కాలంతో పాటు మీరు మారాలి.. వీటిని పిల్లలకు చెప్పడానికి సిగ్గు, సంకోచం, భయం లేకుండా.. వారితో బహిర్గతంగా చెప్పండి. అలాగే బయటి వ్యక్తులు ఇచ్చే తినుబండారాలు అస్సలు తినొద్దని వారికి అర్థమయ్యేట్లు ప్రాక్టికల్‌గా వివరించండి. చాక్లెట్స్‌ ఆశ చూపి ఎందరో కామాంధులు చిన్నారుల జీవితాలను ఛిదిమేస్తున్నారు. పంజరంలో చిలక కంటే ఎక్కువ జాగ్రత్తగా పెంచుకోవాలి..ఆడపిల్లలను.

Read more RELATED
Recommended to you

Latest news