women: ఈ రోజుల్లో ఒక్క భార్యను పోషించడానికి మగవాళ్లు చాలా కష్టాలు పడుతున్నారు. మన దేశంలో బహుభార్యతం కూడా లేదు.. అయినా అక్కడక్కడ రెండో పెళ్లి చేసుకునే వాళ్లు ఉన్నారు.. ఒకటి రెండు పెళ్లిళ్లు అంటే సరే కామన్ అనుకోవచ్చు. బీహార్‌లోని అర్వల్ జిల్లా ఒక రెడ్ లైట్ ఏరియాలో 40 మంది మహిళలు ఒక్క వ్యక్తిని తమ భర్తగా భావిస్తున్నారు.. అంతే కాకుండా చాలా మంది పిల్లలు కూడా తమ తండ్రిగా అతడి పేరునే చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది.
బీహార్‌లో ప్రస్తుతం కుల గణన జరుగుతోంది. ఈ క్రమంలోనే అర్వల్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండే రెడ్ లైట్ ఏరియాలో అధికారులు కుల గణనకు వెళ్లారు. అక్కడి వారు తాము ఏ కులానికి చెందిన వాళ్లం కాదు అని పేర్కొన్నారు. అంతే కాకుండా 40 మంది మహిళలు తమ భర్తగా ఒకే ఒక్క పేరును చెప్పారు. 40 మంది మహిళలు మాత్రమే కాకుండా ఎంతో మంది పిల్లలు కూడా తమ తండ్రిగా అతడి పేరునే చెప్పడం జరిగింది. ఆ పేరే రూప్ చంద్. అంత మందిని అతడు పెళ్లి చేసుకోలేదు.. నిజంగా ఆ పిల్లలకు అతడు తండ్రి కాదు.
అసలు విషయం ఏంటంటే..
ఆ రెండ్ లైట్ ఏరియాలో వందల మంది ఆడవారు పెళ్లి చేసుకోకుండా జీవనం సాగిస్తున్నారు. వారి యొక్క వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు. దాంతో చాలా మంది పిల్లలకు కూడా తండ్రి ఎవరు అనే విషయంలో స్పష్టత లేదు. అందుకే ఆ ప్రాంతంలో నివాసం ఉండే డాన్స్ మాస్టర్ రూప్ చంద్ అంటే అందరికి అభిమానం. ఆ అభిమానంతోనే చాలా మంది మహిళలు అతడిని భర్తగా భావిస్తూన్నారట. రూప్ చంద్‌కు ఆ ప్రాంతంలో కనీసం ఇల్లు కూడా లేదు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో అతడికే తెలియదు. అలాంటి వ్యక్తిని భర్తగా చెప్పుకోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు అని మహిళలు అధికారులకు తెలిపారట.