మహిళలకు జీవనోపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్ !

-

ఈ రోజు గ్రామీణాభివృద్ధిపై సమీక్షలో మాట్లాడిన సీఎం జగన్ రాష్ట్రంలో మహిళల భద్రత మరియు వారు సంతోషంగా ఉండడమే ప్రభుత్వం యొక్క కోరిక అని తెలిపారు. చేయూత, ఆసరా, కాపు నేస్తం, EBC నేస్తం లాంటి పధకాల ద్వారా వారికి అందుతున్న అమౌంట్ కు వారు జీవనోపాధి కల్పించుకోవాలి. ఎలా అయితే మహిళలు అంతా తయారు చేస్తున్నవస్తువులను మార్కెటింగ్ చేసుకోవడానికి తగిన సపోర్ట్ ను ప్రభుత్వం వారికి అందించాలి. దానికి ప్రముఖ కంపెనీ లను వారితో టై అప్ చేసి వారిని కూడా పార్టనర్ లుగా అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ జగన్ అన్నారు.

మహిళల సాధికారతే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పారు. ఇక గ్రామములలో రోడ్ లను నిర్మించే సమాయంతో తగిన జాగ్రత్తలు తీసుకుని కనీసం అయిదు సంవత్సరాలు నిలిచిపోయేలా క్వాలిటీ తో నిర్మించాలని అధికారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version