గత నాలుగు నెలలుగా దేశంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వరుసగా తుఫాన్ లు ఏర్పడుతూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో భారి వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీనితో ప్రజలు అస్తవ్యస్తాలు పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా సరే వరద బాధితుల ఇక్కట్లు తొలగించలేకపోతున్నాయి. గత నెలలో మూడు తుఫాన్ లు ఏర్పడ్డాయి. ఈ నెల మొదట్లో మళ్ళీ తుఫాన్ ఏర్పడింది… భారీ వర్షాలతో జన జీవన౦ స్తంభిస్తుంది. ఇప్పటికే 5 రాష్ట్రాలకు వర్ష సూచన చేసారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు చేస్తున్నారు. అసలు చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళవద్దని సూచిస్తున్నారు. దీనికి కొన్ని సంచలన నిజాలు చెప్తున్నారు. సముద్రంలో భారీ వర్షాలు పడుతున్నాయట. భారీ వర్షాలతో సముద్రంలో వాతావరణం భయంకరంగా మారిందని, భారి శబ్దాలతో ఉరుములు, పిడుగులు పడుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా బంగాళాఖాతం లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందని అంటున్నారు. అరేబియా మహాసముద్రంలో కూడా ఇదే వాతావరణం ఉందని అంటున్నారు.
అలాగే సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఈ రెండు నెలల్లో మరీ ఎక్కువగా ఉందని అంటున్నారు. గత నెలలో సముద్రంలో వరుసగా వారం రోజుల పాటు భారి వర్షాలు పడ్డాయు. శ్రీలంకకు చెందిన జాలర్లు కూడా కనిపించకుండా పోయారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకే భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు సముద్రంలో వాతావరణం గురించి జాలర్లను హెచ్చరిస్తూనే ఉంది. కొన్ని చోట్ల తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకి వచ్చిందని, అక్కడ నివసించే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ.