ఆ ఊర్లోకి వెళ్లాలంటే.. చెప్పులు విప్పాల్సిందే.. పాదరక్షలు ఉంటే..పెద్ద శిక్షే..!

-

చెప్పులు లేకుండా ఎక్కడకు వెళ్లలేం….చెప్పులులేకపోతే.. షూస్‌ వేసుకుని వెళ్లొచ్చుగా అనకండి..! పాదరక్షలు లేకుండా ఒక్క ఆలయానికి తప్ప ఇంక ఎక్కడికైనా దర్జాగా వెళ్లొచ్చు కదా..! ఈమధ్య కొన్ని షాప్స్‌ వాళ్లు బయట బోర్డు పెట్టుకుంటున్నారు.. చెప్పులు విడిచి రావలెను అని.. నిజానికి అలా ప్రతిసారి షూస్‌ విడిచి వెళ్లడానికి కొందరికి ఇబ్బందిగా ఉండి వెరే షాప్స్‌కు కూడా వెళ్తారు.. కానీ మీరు ఆ ఊరికి వెళ్తే చెప్పులు విడిచే వెళ్లాలి. ఆ ఊర్లో చెప్పులేసుకుని కనిపించారో..పెద్ద శిక్ష విధిస్తారట. ఇదేం ఆచారంరా నాయనా అనిపిస్తుందా..!

ఆ ఊరి పేరు అండమాన్. ఈ గ్రామం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండమాన్ గ్రామంలో దాదాపు 130 కుటుంబాలు నివసిస్తున్నాయి ఉంటాయి. వారిలో ఎక్కువ మంది రైతులే ఉన్నారు. అయితే ఈ ఊరికి ఒక ప్రవేశ ద్వారం ఉంది. ఈ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న పెద్ద చెట్టుని ఈ అండమాన్ గ్రామస్తులు ముత్యాలమ్మ అనే దేవతగా పూజిస్తారట… ఇలా ఆ చెట్టుని దేవతగా ఆరాధించడం వల్ల దేవత తమ గ్రామాన్ని కాపాడుతుందని ప్రజల నమ్మకం.

గ్రామంలోకి రావాలంటే.. ప్రతి ఒక్కరూ ద్వారం బయటే చెప్పులను వదిలి లోనికి ప్రవేశించాలి. సరే లోపలికి వచ్చాక అయినా చెప్పులేసుకుని తిరగొచ్చా అంటా అదీ లేదు.. గ్రామంలోని కూడా ఎవరు చెప్పులు వేసుకుని నడవడానికి వీలు లేదు. అలా కాదని ఎవరైనా గ్రామం లోపల చెప్పులు ధరిస్తే కఠినమైన శిక్షకు అర్హులు అవుతారట. ఎందుకంటే గ్రామస్తులు ద్వారం లోపల గ్రామానికి చెందిన భూమి మొత్తాన్ని ఎంతో పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ద్వారం లోపలి భాగాన్ని దేవునికి ఇల్లులా అనుకుంటారట. గ్రామం రోడ్లపై చెప్పులు వేసుకుని నడవటం వలన దేవుడికి కోపం వస్తుందని వీరి నమ్మకమట.

వీళ్లకు పర్మిషన్‌ ఉంది..

ఈ గ్రామంలో నివసిస్తున్న వృద్దులు మాత్రం మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్లాలంటే.. బూట్లు లేదా చెప్పులు ధరించవచ్చు అని గ్రామ పంచాయతీ అనుమతించింది. వృద్దులు కాకుండా వేరే ఎవరైనా చెప్పులు వేసుకుని నడిస్తే వాళ్ల పని అయిపోయిందే.. ఈవిధంగా చెప్పులు లేకుండా గ్రామంలో నడవడం అనేది నాలుగు తరాలుగా జరుగుతుందని గ్రామస్తులు చెప్తున్నారు. పెద్ద విషయమే..!

Read more RELATED
Recommended to you

Latest news