ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా నాయనా.. వైరల్..

-

సోషల్ మీడియా రోజు రోజుకు ఫెమస్ అవుతుంది.. పాపులర్ అవ్వడానికి జనాలు ప్రయోగాలు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.. కొన్ని వైరల్ అవ్వడం మాత్రమే కాదు జనాలకు కోపాన్ని తెప్పిస్తున్నాయి.. మరికొన్ని ఆశ్చర్య పరుస్తున్నాయి. ఒక వెడ్డింగ్ కార్డు ఇప్పుడు వైరల్ అవుతోంది. పెళ్లి శుభలేఖ వైరల్‌ కావటం ప్రస్తుత కాలంలో మామూలే అయిపోయింది. ఎందుకంటే.. ఇప్పుడు ట్రెండ్ మారింది..

కొత్త తరహాలో ఆలోచిస్తోంది యువతరం.. ముఖ్యంగా తమ పెళ్లి విషయంలో మరింత క్రియేటివిటీని యాడ్ చేసుకుంటున్నారు. పెళ్లికార్డు నుంచి.. పెళ్లి వేదిక.. ఇతర కార్యక్రమాలు అన్నీ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు.. తాజాగా ఏపీకి చెందిన ఓ వివాహ ఆహ్వాన పత్రిక ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది. రెండు వేల రూపాయల నోటు తరహాలో పెళ్లి శుభలేఖ అచ్చు వేయించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

విషయానికొస్తే.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఏడిద వెంకటేష్‌.. తన చిన్న కుమార్తె పెళ్లికి రెండు వేల రూపాయల నోటు తరహాలో శుభలేఖ అచ్చు వేయించారు. అలాగే నోటుకు మరోవైపు వివాహానికి సంబంధించి వివరాలు ముద్రించారు.. ఈ వెరైటీ కార్డు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..ఇక ఆలస్యం ఎందుకు ఆ నోటు పత్రికపై ఒక లుక్ వేసుకోండి.. ఎంతైనా ఇలాంటి ఆలోచనలు గోదారోళ్ళకే వస్తాయండి.. గ్రేట్ అంతే..ఆయ్..

Read more RELATED
Recommended to you

Exit mobile version