దేవుడా..ఐస్ క్రీమ్ తో దోస..ఏందీ రా ఇది..

-

మసాలా దోస..ఆనియన్ దోస..సెట్ దోస..పన్నీర్ దోస..ఇలాంటి దోసల పేర్లను మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం.. కానీ కొత్తగా ఈ ఐస్ క్రీమ్ దోస ఏంటి అనుకుంటున్నారా.. అవును అండీ ఇది వెరైటీ దోస.. కాస్త డిఫరెంట్ గా ఉండటంతో జనాలు ఎక్కువగా దీన్ని తినడానికి ఇష్టపడుతున్నారు..తియ్యగా, చల్లగా ఉండే ఈ దోస గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ ఐస్ క్రీమ్ దోస గురించి తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం విజయవాడకు వెల్లాల్సిందే..వివరాలొకి వెళితే..కేదారేశ్వరరవుపేటలోని ప్రభాస్ కాలేజీకు సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ భవన్టిఫిన్ సెంటర్ కు వెళ్ళాల్సిందే. అదేంటి అండి దోసెలో ఐస్ క్రీమ్ అని ఆలోచిస్తున్నారా కేవలం ఐస్ క్రీమ్ ఒకట్టే కాదండి. ఇంకా ఇరువై నాలుగు రకాల దోసెలు అక్కడ ప్రత్యేకం.ఐస్ క్రీం దోసె , చాక్లెట్ దోసె, లేస్ దోసె హార్లిక్స్ దోసె, ఉలవచారు దోసె, లేస్‌ దోసె.ఇలా ఒకటెంటిరకరకాల దోసెలు ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. కేవలం దోసెలు మాత్రమే కాదు.. ఇక్కడ రకాల రకాల ఇడ్లీలు కూడా ఫుడ్ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి. శ్రీ గణేష్ భవన్ లో లభించే టిఫిన్ కోసం ఎక్కడి నుంచో జనాలు వస్తున్నారట..

1982లో ప్రారంభమైన ఈ హోటల్ కు మంచి ఆదరణ ఉంది. ఫుడ్ లవర్స్ ఎప్పుడు ఏదో ఒక కొత్తదనం కోరుకుంటుంటారు. సరికొత్త రెసీఫీలు ఉంటే ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. వాళ్ళ కోసమే పదేళ్ల క్రితం నుంచిఈ ఇరవై నాలుగు రకాల దోసెలు రెసిపీలు తయారుచేసినట్లు హోటల్ నిర్వహకులు తెలిపారు. పది ఏళ్ల నుంచి పూర్తి స్థాయి హోటల్ మేనేజ్మెంట్ తో పాటు ఈ రేసిపలను కనుగొన్నట్లు హోటల్ యాజమాన్యం చెబుతోంది.. సామాన్యులకు సైతం అందుబాటు ధరలోనే ఇక్కడ ఇన్ని రకాల దోసెలు, ఇడ్లీలు అందిస్తున్నాం అంటున్నాడు బాబాయ్‌. ఇక్కడ దోసెలన్నీ రూ.30-70 మాత్రమే ఉంటాయి.ప్రతి ఒక్కరి అభిరుచికి తగిన విధంగా ఇక్కడ టిఫిన్లు ఉంటాయి..మీరు కూడా ఎప్పుడైనా విజయవాడకు పోతే అక్కడ టిఫిన్ ను ట్రై చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version