కొంతమంది ప్రతి సమస్యకు సూసైడ్ చేసుకోవడమే పరిష్కారం అనుకుంటారు. ఇక ఈ జీవితం వద్దు అని క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధానంగా కుటుంబకలహాలే కారణం అవుతాయి. నిన్ననే.. తెలంగాణలో కన్నతల్లి నలుగురి పిల్లలను కెనాలో తోసేసింది. పాపం వాళ్లంతా చనిపోయారు. డబ్లూహెచ్వో లెక్కల ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏడు లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందులో ఎక్కువగా అమెరికాలోనే పాల్పడుతున్నారు. దాదాపు 40 శాతం మంది అమెరికా వాస్తవ్యులే ఉన్నారట. ఆత్మహత్యలకు గాలి కాలుష్యం కూడా కారణం అవుతుందని అధ్యయనం చెబుతోంది.
గత ఏడాది సంపన్న దేశమైన అమెరికాలో ఒక్క ఏడాదిలోనే 50 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ప్రతి 11 నిమిషాలకు అక్కడ ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మానసిక ఆరోగ్యం బాగోనప్పుడే ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయని వైద్యులు అంటున్నారు. ఒంటరితనం వల్ల కూడా ఆత్మహత్య ఆలోచనలను పెరుగుతాయని చెబుతున్నారు.
గాలి వల్ల కూడా ఆత్మహత్య ఆలోచనలు వస్తాయా..?
ఆత్మహత్యల ఆలోచనలకు కేవలం వారి వ్యక్తిగత సమస్యలు, మానసిక ఆరోగ్యమే కాదు గాలిలో నాణ్యత తగ్గినా కూడా ఆ ఆలోచనలు వస్తాయని ఒక అధ్యయనం చెబుతోంది. వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రదేశాల్లో జీవించే వారికి అలాంటి సూసైడ్ ఆలోచనలు త్వరగా వచ్చే అవకాశం ఉందని ఆ అధ్యయనం చెబుతోంది. యేల్ యూనివర్సిటీకి చెందిన సహోద్యోగులు కలిసి వాయు కాలుష్యానికి, ఆత్మహత్యలకు ఉన్న సంబంధంపై అధ్యయనాన్ని నిర్వహించారు. దానిలో భాగంగా 18 పరిశోధనలను చేశారు. అడవులు కాలిపోవడం వల్ల, ఇల్లు తగలబడడం వల్ల, భవన నిర్మాణాల జరగడం వల్ల, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, వాయువులు, ఇంధనాలు అధికంగా గాలిలో కలుస్తాయి. ఆ గాలిలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ వంటివి అధికంగా ఉంటాయి. వాటిని పీల్చినప్పుడు ఆత్మహత్యల ఆలోచనలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అందుకే వాయు కాలుష్యానికి దూరంగా ఉండమని చెబుతున్నారు పరిశోధకులు. వాయు కాలుష్యంలో మూడు రోజుల కన్నా ఎక్కువగా ఉంటే వారి ఆలోచనలు మారుతాయని, దీర్ఘకాలిక వాయు కాలుష్యం వల్ల డిప్రెషన్ వస్తుందట.
ఆ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్లనే సమస్య..
ఊపిరితిత్తుల్లోకి గాలి ద్వారా ప్రవేశించే వాయు కాలుష్య కారకాలు రక్త ప్రవాహంపై ప్రభావం చూపిస్తాయి. ఆ తరువాత మెదడుకు, ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తాయి, ఇలా చేయడం వల్ల మెదడులో సెరటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే సెరటోనిన్ ఉత్పత్తి తగ్గితే నిరాశ, డిప్రెషన్ వంటివి కలుగుతాయి. కాబట్టి వాయు కాలుష్యానికి దూరంగా ఉంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అధిక ఉష్ణోగ్రతల వల్ల వాయు కాలుష్యం తీవ్రమై స్త్రీ, పురుషుల్లో ఆత్మహత్య ఆలోచనలు అధికంగా అవుతున్నట్టు వారు గుర్తించారు. అయితే ఈ వాయు కాలుష్యం ఎక్కువ ప్రభావం చూపించేది మగవారిపైనే. అమెరికాలో గత ఏడాది సూసైడ్ చేసుకున్న వారిలో 80 శాతం మంది పురుషులే ఉన్నారు.
ఏది ఏమైనా వీలైనంత వరకూ నేచర్‌గా దగ్గరగా ఉండండి. ఇంటి పరిసర ప్రాంతాల్లో పచ్చిన చెట్లు నాటండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.