ఇలా చేస్తే.. ఏసీ ఎక్కువ వాడినా.. కరెంట్ బిల్ తక్కువే వస్తుంది..!

-

వేసవికాలంలో ప్రతి ఒక్కరూ ఏసిని ఎక్కువగా వాడుతారు. ఏసీ ని ఎక్కువగా ఉపయోగించినా కరెంట్ బిల్ ఎక్కువ రాకూడదంటే ఈ టిప్స్ పాటించండి. వేసవికాలంలో ఏసీ కారణంగా కరెంట్ బిల్లు వేలల్లోనే వస్తుంది. అలా కాకుండా కరెంట్ బిల్ తక్కువ రావాలంటే ఈ టిప్స్ ని కచ్చితంగా అనుసరించాల్సిందే. వేసవిలో ఎండలు విపరీతంగా ఉంటాయి. ఉదయం 9 గంటలకే ఎండా వచ్చేస్తుంది. దాంతో ప్రతి ఒక్కరూ ఉదయాన్నే ఏసీ ని ఆన్ చేస్తూ ఉంటారు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు రాత్రే కాదు ఉదయం కూడా ఏసీ ని ఆన్ చేసి పెడతారు. ఏసీ వలన కరెంట్ బిల్ విపరీతంగా వస్తుంది.

ఏసీ బిల్ ని తగ్గించుకోవాలంటే సరైన ఉష్ణోగ్రత లో ఏసీ ని వినియోగించాలి ఎప్పుడూ కూడా ఏసిని కనిష్ట ఉష్ణోగ్రతల వద్ద పెట్టొద్దు. ఎక్కువ మంది 16 లేదా 18 డిగ్రీల వద్ద పెడతారు అలా కాకుండా 24 డిగ్రీల వద్దనే ఉంచండి ఈ స్థాయిలో ఏసీ పైన లోడ్ పడదు అప్పుడు కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది.
చాలామంది ఏసీ ని వినియోగించినప్పుడు పవర్ బటన్ ని ఆఫ్ చేయడం మర్చిపోతారు పవర్ బటన్ ని ఆఫ్ చేయడం అసలు మర్చిపోకండి. అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోండి. ఏసీ ఆఫ్ చేయడం ముఖ్యం ఎందుకంటే కంప్రెసర్ ఐడియల్ లోడ్ కండిషన్ లోకి వెళ్లి పవర్ వినియోగిస్తూనే ఉంటుంది. దాంతో కరెంట్ బిల్ వస్తుంది.
అలానే చాలామంది రాత్రిపూట ఏసిని ఫుల్లుగా పెట్టి నిద్రపోతూ ఉంటారు కనీసం ఏసి నడుస్తోందని సంగతి మర్చిపోతూ ఉంటారు రాత్రంతా ఏసిని ఆన్ చేసి పెట్టడం వలన కరెంట్ బిల్లు బాగా వస్తుంది. అలా కాకుండా టైమర్ ని సెట్ చేసుకుని ఉంచుకోండి అప్పుడు ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది. కరెంట్ బిల్ కూడా ఆదా అవుతుంది.
ఏసీలకి రెగ్యులర్ గా సర్వీసింగ్ చేయించడం కూడా చాలా ముఖ్యం సర్వీసింగ్ చేయాల్సిన అవసరం ఉంటే కచ్చితంగా చేయించుకోండి. కరెంట్ బిల్ కూడా ఆదా అవుతుంది. ఏసీ ఆన్ చేసే ముందు తలుపులు కిటికీలు క్లోజ్ చేయండి లేకపోతే కూలింగ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version