50 రోజుల్లో బలగం వసూళ్లు.. నిర్మాతలకు కాసుల వర్షమే!

-

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది బలగం మూవీ. స్టార్ హీరో కాస్టింగ్ భారీ బడ్జెట్ ఏవీ అవసరం లేకుండా సినిమాకు కథ మాత్రమే ప్రాణం అంటూ నిరూపించిన బలగం మూవీ హిట్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారి తీసింది కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనుకోని విజయాన్ని సాధించింది తాజాగా ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వసూళ్లపై భారీ చర్చ జరుగుతుంది మరి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా వసూళ్లు ఎంత అంటే..

కథ బలంతో అభిమానుల్ని కట్టిపడేసిన సినిమా బలగం.. తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ బంధాల పరిమళాన్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. అన్నదమ్ముల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా పల్లెటూర్ల నుంచి స్టార్ హీరోల వరకు అందర్నీ కదిలించింది మెగాస్టార్ చిరంజీవి సైతం వేణుని అభినందించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. OTTలో వచ్చిన తర్వాత కూడా ఈసినిమా థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టింది. కాగా బలగం సినిమానుబీశిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించగా వారికి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కేవలం 2 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 50 రోజుల్లో 40 కోట్ల గ్రాస్ దాటి వసూలు సాధించడం చెప్పుకోదగిన విషయం.

 

కాగా ఇటీవలే బలగం సినిమా రెండు లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డులు అందుకుంది. అలాగే మరో ఇంటర్నేషనల్‌ అవార్డు గెలుచుకుంది. బెస్ట్‌ డ్రామా ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఒనికో ఫిల్మ్‌ అవార్డు(ఉక్రెయిన్‌) సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version