ఇలా చేస్తే మీ తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా అయిపోతుంది..!

-

తెల్లజుట్టును నల్లగా చేసేందుకు చాలామంది తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా హెయిర్‌ డైలు వంటివి వాడుతుంటారు. వీటిల్లో ఉండే అమోనియా వల్ల జుట్టు బాగా ఊడిపోతుంది. మీరు గమనించారో లేదో.. ఎప్పుడైతే మీరు కలర్‌ వేసుకోవడం స్టాట్‌ చేశారో అప్పటి నుంచి మీ జుట్టు ఊడిపోవడం మొదలుపెడుతుంది. చాలామందికి ఇలానే జరుగుతుంది. చిన్నవయసులో వచ్చే తెల్ల వెంట్రకలు శాశ్వతంగా నల్లగా మార్చేందుకు కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి.. వీటిని ఓపిగ్గా ఫాలో అయితే మీ జుట్టు త్వరగా నల్లగా అవుతుంది.

కొంద‌రిలో మెల‌నిన్ త‌గ్గ‌డం వ‌ల్ల కూడా న‌లుపుద‌నం పోయి జుట్టు తెల్ల‌గా మారుతుంది. ఓ స‌హ‌జ సిద్ధ‌మైన చిట్కాను పాటిస్తే చాలు.. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. ఇది స‌మ‌స్య‌ను శాశ్వ‌తంగా ప‌రిష్క‌రిస్తుంది. అంతేకాదు.. దీన్ని పాటించ‌డం వ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ క‌ల‌గ‌వు. మ‌న ఇంట్లో ల‌భించే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే..

 

స్వ‌చ్ఛమైన కొబ్బ‌రినూనె అర క‌ప్పు, ఉసిరిక పొడిని రెండు టీస్పూన్ల చొప్పున తీసుకోవాలి. ఒక చిన్న పాత్ర‌లో ముందుగా కొబ్బ‌రినూనె పోసి అందులో ఉసిరిక పొడి వేసి బాగా క‌లియ‌బెట్టాలి. ఈ మిశ్ర‌మాన్ని స‌న్న‌ని మంట‌పై వేడి చేయండి.. దీంతో కొంత సేప‌టికి ఇది న‌ల్ల‌గా మారుతుంది. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఈ మిశ్ర‌మాన్ని తీసి ప‌క్క‌న పెట్టాలి. చ‌ల్ల‌గా అయిన త‌రువాత ఒక టీస్పూన్ మిశ్ర‌మం తీసుకుని జుట్టుకు బాగా త‌గిలేలా రాయండి..ఒక గంట సేపు అయ్యాక త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల తెల్ల‌గా ఉన్న జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. దీన్ని స‌మ‌స్య పరిష్కారం అయ్యేంత వ‌ర‌కు వారానికి ఒక‌టి లేదా రెండు సార్లు ఉప‌యోగించ‌వ‌చ్చు. దీంతో జుట్టు ఎప్ప‌టికీ న‌ల్ల‌గా క‌నిపిస్తుంది. ఇత‌ర జుట్టు స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. జుట్టుకు ఉసిరి చేసినంత మేలు ఇంకేది చేయలేదంటే నమ్మగలరా..! ఉసిరి కాయలతో ఆయిల్‌ చేసుకుని రాసుకున్నా.. మీ జుట్టు ధృడంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version