బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ వాది ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘన సత్కారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది కేవలం నాకు జరిగిన సత్కారమే కాదు.. నాలాంటి ఎందరో తెలంగాణ వాదులకు జరిగిన సత్కారం అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిని మేల్కొల్పిన ఉద్యమ రథ సారథి, తెలంగాణ ప్రగతి ప్రదాత కేసీఆర్. వారి వద్ద 25 ఏండ్ల పాటు పనిచేయడం నా అదృష్టం, నాకు దక్కిన గొప్ప అవకాశం. కేసీఆర్ లేనిది తెలంగాణ రాష్ట్రం రాకపోయేది. తెలంగాణ కోసమే కేసీఆర్ జీవితం అర్పితం చేశారు.
కేసీఆర్ మాదిరి తన ప్రజల పట్ల అంతగా నెనరున్న జననేత మరెక్కడా కానరాడు. తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ స్థానం శాశ్వతం. తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన నాకు అమెరికా వెళ్లి పోవడం తప్పనిసరిగా మారింది. తెలంగాణ గడ్డను వదిలి వెళ్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది, కానీ తప్పని పరిస్థితి. తెలంగాణ వాదులందరి తరఫున కేసీఆర్ కి ధన్యవాదాలు. అడ్డు తెరలు లేని ఆత్మీయతకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా కేసీఆర్ నిలిచారు అని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.