సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి కావాల్సిన టిప్స్

-

పెళ్లి.. ఈ మధ్యకాలంలో యువతను బాగా భయపెడుతున్న మాట. ఎస్.. పెళ్లంటే నేటి యువత భయపడుతోంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. జీవితంలోకి వచ్చేవాళ్లు ఎలా ఉంటారోనన్న అనుమానంతో పాటు.. అప్పటివరకు ఉన్న స్వేచ్ఛ ఉండదేమోనన్న సందేహం పెళ్లంటేనే పక్కకు తప్పుకునేలా చేస్తుంది.

అయితే అందరూ అలా ఉన్నారా అంటే అది కూడా కాదు. చాలామంది పెళ్లి చేసుకోవాలని, పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని కలలు కంటున్నారు. అలాంటివారు ఒక్కోసారి జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఫెయిల్ అయ్యి విడాకుల దిశగా వెళ్తున్నారు.

పెళ్లి చేసుకుని హ్యాపీగా సంసార సాగరాన్ని ఈదుతూ ఎంజాయ్ చేయాలనుకునే వారు.. జీవితంలో మంచి భాగస్వామిని తెచ్చుకోవాలి. ముఖ్యంగా పెళ్లి మీద మనసు పడ్డ తర్వాత.. టకటకా ఏమీ తెలుసుకోకుండా ఏదో తంతులాగా పెళ్లి చేసుకోకూడదు.

గత రెండు మూడు నెలల నుండి అవతలి పర్సన్ తెలుసన్న కారణంతో పెళ్లి చేసుకోకూడదు. రెండు మూడు నెలల్లో ఆ పర్సన్ గురించి తెలిసేది చాలా తక్కువ. ప్రతీ ఒక్కరిలో డార్క్ సైడ్ ఉంటుంది. అది చాలా తక్కువ సందర్భాల్లో బయటకు కనిపిస్తుంటుంది. అందుకే తొందరగా, ఆవేశంగా అవతలి వాళ్ళ గురించి తెలుసుకోకుండా పెళ్లి చేసుకోకూడదు.

అరేంజ్ మ్యారేజ్ లో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. పెళ్లి చూపులు అవ్వగానే.. తొందరపడకూడదు. నిదానంగా అవతలి పర్సన్ తో 4, 5 మీటింగులు అయిన తర్వాత మాత్రమే ఒక కంక్లూజన్ కి రావాలి.

కాస్తంత టైం తీసుకుని అవతల వారిని డీప్ గా స్టడీ చేస్తే.. వారి అభిరుచులు ఏంటో అలవాట్లు ఏంటో మీకు అర్థమవుతాయి. అప్పుడు వాళ్లు మీకు సెట్ అవుతారో లేదో తెలుస్తుంది. ఆ తర్వాత మాత్రమే పెళ్లిపై నిర్ణయం తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version