ఆ రెస్టారెంట్‌లో భోజనం చేయాలంటే నాలుగేళ్ల ముందే టేబుల్‌ బుక్‌ చేసుకోవాలట

-

మనం ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు అక్కడ టేబుల్స్‌ ఖాళీ లేకపోతే మహా అయితే అరగంట వెయిట్‌ చేస్తాం. అంతకుమించి నిరీక్షించే ఓపిక మనకు ఉండదు. వేరే రెస్టారెంట్‌కు వెళ్లిపోతాం. కానీ ఓ హోటల్‌లో భోజనం చేయాలంటే నాలుగేళ్లు వెయిట్‌ చేయాలి తెలుసా..? నమ్మలేపోతున్నారా..? అంతగా ఏముందబ్బా ఆ రెస్టారెంట్‌లో. ఇంతకీ ఆ రెస్టారెంట్‌ ఎక్కడ ఉందంటే..

ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ అనే సిటీలో ఈ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ పేరు ది బ్యాంక్ టావెర్న్ పబ్. ఇది పబ్ కమ్ రెస్టారెంట్ టైప్. ఇక్కడ వీకెండ్స్‌లో బోజనానికి ఫుల్ క్రేజ్ ఉంటుంది. క్రేజీ క్రేజీ మెనూతో క్రేజీ క్రేజీ రెసిపీలతో వడ్డి వారించడమే ఇక్కడి స్పెషాలిటీ. అందుకే ఇంగ్లాండ్ వాసులు ఈ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు విపరీతంగా పోటీపడుతున్నారట.

ఒకవైపు హోటల్ బిజినెస్ అంతా విపరీతంగా పోటీ ఎదుర్కొంటున్న రోజుల్లోనూ ఇక్కడ సండే లంచ్ చేయాలంటే నాలుగేళ్లు ఆగాల్సిందేనట. ఒకవేళ ఇక్కడ బోజనం చేయాలి అనుకుంటే మామూలు వీక్ డేస్‌లో పెద్దగా రద్దీ లేనప్పుడు వెళ్లాల్సిందే. సండే రోజే ఇక్కడ లంచ్ చేయాలనుకుంటే మాత్రం నాలుగేళ్లు ఆగాల్సిందే.

నాలుగేళ్లు ఆగి మరీ తినేంత గొప్ప విలువ అక్కడ ఏం ఉంటుందా ? అని సండే రోజు అక్కడ బోజనం చేసిన కస్టమర్లని అడిగితే.. వారు అవుననే సమాధానం చెబుతారు. అంతేకాదు ఈ రెస్టారెంట్స్‌లో మీల్స్‌కి అవార్డ్స్ కూడా వరించాయి. అక్కడ బోజనం ఖరీదు కూడా ఎక్కువగా ఉండదు. వాళ్ల కరెన్సీలో అయితే కేవలం 26.95 పౌండ్లు ఒక రకం బోజనం, 21.95 పౌండ్స్ మరో రకం ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో మొదటి రకం మీల్స్ కి రూ. 2,835 రెండో రకం మీల్స్ కి 2309 రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా ఇద్దరు మనుషులకు కలిపి. వినడానికి విచిత్రంగా ఉంది కదూ.. మీరు కూడా ఎప్పుడైనా ఇంగ్లాండ్‌కి వెళ్లి బ్రిస్టల్ సిటీకి వెళ్తే ఈ రెస్టారెంట్లో బోజనం ట్రై చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version