తిరుమలలో పవిత్రత దెబ్బ తినేలా చంద్రబాబు అసత్య ప్రచారం చేశాడు. ఆవు కోవ్వు, పందికోవ్వు కలసినట్లు ఒక్క మాట సిబిఐ సిట్ లో రిమాండ్ లో చెప్పలేదు అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఏఆర్ డైరీ సహా ఇతర రెండు డైరీలు చేసినా అక్రమాలపై మాత్రమే రిమాండ్ రిపొర్టు లో చెప్పకోచ్చారు. చంద్రబాబు మాత్రం లడ్డులో మందుకోవ్వు , జంతువుల కోవ్వు కలసిందని ప్రచారం చేశాడు. హిందూల మనోభావాలను దెబ్బ తీసే లా చంద్రబాబు మాట్లాడారు. నాణ్యత లేకుండా వనస్పతి కలవడంతో తిరస్కరించామని ఈవో శ్యామలరావు తెలిపారు. ఏఆర్ డైరీలో నుండి వచ్చిన నాలుగు ట్యాంకుల్లో నాణ్యత లేదని వెనక్కి పంపినట్లు ఈవో తెలిపారు.
అరెస్టు అయినా నలుగురు సరఫరా వ్యవహారం తప్పులు చేశారని సిట్ చెబుతోంది. ల్యాబులో దృవీకరించిన తరువాత తిరుమలకు నెయ్యి పంపుతారు. కల్తీ జరగకుండా జరిగిపోయిందని అసత్య ప్రచారం చేశారు. లడ్డు నాణ్యత పెంచడానికి గతంలో ఏ ప్రభుత్వం చేయాని విధంగా ప్రత్యేక చర్యలు వైసిపి ప్రభుత్వం తీసుకుంది. సిట్ రిపొర్టు లో ఎక్కడ కూడా కల్తీ జరిగిందని చెప్పలేదు. పవన్ కల్యాణ్ అయితే పవననందా స్వామీ అంటూ తిరుపతిలో సభ పెట్టి అబద్దాలు చెప్పాడు. అయోధ్యకు లక్ష లడ్డులు సరఫరా చేశారని పవన్ చెప్పాడు. బురద చల్లుతాం.. తుడుచుకోవాలనేలా కూటమీ ప్రభుత్వం చేస్తోంది. అసత్య ప్రచార చేసినా కూటమీ ప్రభుత్వం దేవదేవుని ఆగ్రహానికి గురికాక తప్పదు. రాజకీయాలు పరమైన ఆరోపణలు ఎమీనా చేసుకోండి.. వెంకటేశ్వర స్వామీ మీ రాజకీయాలు కోసం వాడుకోకండి. నెయ్యిలో కల్తీ జరగలేదు.. కల్తీ జరిగింది అంతా పవన్ ,చంద్రబాబు బుద్దిలో అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.