ఓ వ్యక్తి గొంతులో మొక్కలు మోలిచాయట.. ప్రపంచంలోనే ఇది తొలిసారి..!!

-

ఈరోజుల్లో విచిత్రమైన రోగాలు, అంతకంటే విచిత్రమైన వైరస్‌లు వస్తున్నాయి. ఆధునిక కాలంలో కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు బయటపడుతున్నాయి. అలాంటిదే ఇది కూడా..కోల్‌కతాలోని ఒక వ్యక్తికి మూడు నెలల నుంచి గొంతు సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. అతని గొంతు బొంగురు పోయింది. కారణం తెలుసుకునేందుకు వైద్యులను కలిశారు. వారు ఎండోస్కోపీ ద్వారా పరీక్షించారు. ఆ పరీక్షలో వారికి గొంతులో చిన్న మొక్కల్లాంటి ఆకారాలు కనిపించాయట. అవి ఫంగస్ అని తేల్చారు వైద్యులు. ఈ వైద్య నిపుణులు జర్నల్ మెడికల్ మైకాలజీ కేస్ రిపోర్ట్స్‌లో దాని గురించి వ్రాశారు. ఇలా గొంతులో మొక్కలు రావడం ఇదే తొలిసారట.. ప్రపంచంలోనే ఇలాంటి వ్యాధి ఇంతవరకూ ఎవరికి రాలేదట..

ఎలాంటి రోగాలు లేవు..కానీ..

అరుదైన ఈ ఫంగల్ వ్యాధితో బాధపడుతున్న రోగి ‘అనోరెక్సియా’ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనకు మూత్రపిండ వ్యాధి, మధుమేహం, HIV వంటి సమస్యలు ఏం లేవు. దీర్ఘకాలిక వ్యాధుల చరిత్ర కూడా లేదు. ఈ వ్యాధి ఆయనకు మొక్కల నుంచి సోకినట్టు వైద్యులు అనుమానిస్తున్నారు. అతను తన పరిశోధన కోసం క్షీణిస్తున్న పుట్టగొడుగులు, ఇతర మొక్కల శిలీంధ్రాలతో పనిచేసే ఒక మైకాలజిస్ట్. ఆ శిలీంధ్రాలు చేతుల ద్వారా శరీరంలో చేరినట్టు భావిస్తున్నారు. ఆ శిలీంధ్రాల పేరు కొండ్రోస్టెరియం పర్పురియం. ఈ శిలీంధ్రాలే గొంతులో చేరి మొక్కల్లా మొలిచేశాయట…

కొండ్రోస్టెరియం పర్పురియం అంటే…

కొండ్రోస్టెరియం పర్పురియం అనేది మొక్కల శిలీంధ్రం. ఇది మొక్కలలో, ముఖ్యంగా గులాబీ కుటుంబానికి చెందిన వాటిలో వెండి ఆకుల వ్యాధిని కలిగిస్తుంది. ఈ వ్యాధి కేవలం మొక్కలకు మాత్రమే వస్తుందని అనుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు తొలిసారి ఇది మానవులలో గుర్తించారు. ఈ వ్యాధి నిర్ధారణలో మైక్రోస్కోపీ, కల్చర్ ఫంగస్‌ను గుర్తించడంలో విఫలమైందని వైద్యులు చెబుతున్నారు. సీక్వెన్సింగ్ పద్ధతిలో ఈ అరుదైన వ్యాధిని గుర్తించారు. ఆ రోగికి ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. యాంటీ ఫంగల్ మందులను సూచించారు.

వైద్యులకు కూడా అవగాహన లేదు..

ఈ వ్యాధి గురించి వైద్యులకు తక్కువ తెలుసు. ఇది వ్యాప్తి చెందుతుందా లేదా, ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది అనే విషయాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం వీటిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలా మొక్కలతో పరిశోధనలు చేసే వారంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మాత్రం వైద్యులు చెబుతున్నారు.. అలాగే మొక్కలు పెంచేవాళ్లు, నర్సరీలోని పనివాళ్లు, రైతులు కూడా ఇలాంటి మొక్కల శిలీంధ్రాలు శరీరంలో చేరకుండా చూసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version