ఐపీఎల్ నయా రూల్.. బ్యాట్స్‌మెన్‌కు కలిసొస్తుందా..!?

-

కొవిడ్ మహమ్మారి ఎఫెక్ట్ అన్ని రంగాలపైన పడింది. ఈ క్రమంలోనే కరోనా వల్ల ఐపీఎల్ 2021 సీజన్ కూడా అర్ధాంతరంగానే ఆగిపోయింది. కాగా ఈ సీజన్‌ను పునరుద్ధరించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ డేట్స్ ప్రకటించిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా నయా రూల్స్ తెచ్చి బౌలర్స్‌కు షాక్ ఇచ్చింది. జరగబోయే 31మ్యాచ్‌లకు ఇదే రూల్ వర్తించనుంది. ఇకపోతే యూఏఈ వేదికగా జరిగే రెండో దశ మ్యాచ్‌లలో కొవిడ్ బారిన క్రీడాకారులు పడకుండా ఉండేందుకుగాను జాగ్రత్తలు తీసకుంటున్నారు. శానిటైజేషన్ పట్ల శ్రద్ధ వహిస్తున్నారు.

సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు జరగబోయే ఈ మెగా టోర్నీ సెకండాఫ్‌‌లో ఐపీఎల్ ఈ సరికొత్త రూల్‌‌ను వర్తింపజేయనుంది. బాట్స్‌మన్ బాదిన బాల్ స్టాండ్స్‌లో పడితే తిరిగి ఉపయోగించకూడదనే రూల్ తీసుకొచ్చారు. గ్రౌండ్ బయట పడే బాల్‌ను పబ్లిక్ ముట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వారి ద్వారా కొవిడ్ సోకే అవకాశముంటుంది. కాబట్టి ఆ బాల్‌ను వదిలేసి దాని స్థానంలో న్యూ బాల్ వినియోగించాలని బీసీసీఐ ప్రతిపాదించింది.

ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లకు ప్రేక్షకులకు ఎంట్రీ లేదు. కానీ, ఇప్పుడు సెకండ్ ఆఫ్ సీజన్‌లో ప్రేక్షకులకు ఎంట్రీ ఇవ్వబోతున్నందున ఈ నయా రూల్ తెస్తోంది బీసీసీఐ. అయితే, ఈ కొత్త నిబంధనతో బౌలర్లకు ఇబ్బంది ఉండొచ్చని, బ్యాట్స్‌మెన్లకు మాత్రం కలిసొస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. న్యూ బాల్ హార్డ్‌గా ఉంటూ బ్యాట్‌పైకి సులువుగా వస్తుంది తద్వారా బ్యాట్‌మన్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఇక స్పిన్‌కు సహకరించే పిచ్‌లలో బౌలింగ్ అనేది బౌలర్స్‌కు ఇబ్బందే అని చెప్పొచ్చు. అయితే, బాల్‌ను మౌల్డ్ చేసుకోవడానికి బౌలర్‌కు కొంచెం టైం పట్టొచ్చు. బ్యాట్‌మన్‌కు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండకపోగా న్యూ బాల్ ద్వారా కలిసి రావొచ్చని కొందరు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news