ఐటీ దాడులు రాజకీయ కుట్ర అంటూ మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కయిన బీజేపీ కావాలని కాంగ్రెస్ పార్టీపై బురద జల్లేందుకు ఇలా తమపై ఐటీ దాడులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు.
ఇది ఎన్నికల సమయం కదా. దీంతో ఐటీ అధికారులు కూడా రాజకీయ నాయకులపై కన్నేశారు. దానిలో భాగంగా మధ్యప్రదేశ్ లో కోట్లకు కోట్ల నల్లధనం ఐటీ అధికారుల చేజిక్కింది. మధ్య ప్రదేశ్ సీఎం కమల్ నాథ్ బంధువులు, ఆయన సన్నిహితుల నివాసాల్లో ఇంకా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే కమల్ నాథ్ కు చెందిన 50 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. సీఎం బావమరిది ఇంట్లోనే 281 కోట్లు లభ్యమయ్యాయి. గోనె సంచులు, బాక్సుల్లో దాచిన డబ్బులను ఓటర్లకు పంచేందుకే దాచిపెట్టినట్లు తెలుస్తోంది. కమల్ నాథ్ కు చెందిన బంధువల ఇళ్లలోనూ లెక్కలేనంత డబ్బు దొరికినట్టు ఐటీ అధికారులు తెలిపారు. డబ్బు తరలించేందుకు ఏకంగా లారీనే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఇంకా లెక్కించని డబ్బుతో పాటు 14.6 కోట్ల నగదును సీజ్ చేశామని… డబ్బుతో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ తో పాటు ఢిల్లీలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇది రాజకీయ కుట్ర..
ఐటీ దాడులు రాజకీయ కుట్ర అంటూ మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కయిన బీజేపీ కావాలని కాంగ్రెస్ పార్టీపై బురద జల్లేందుకు ఇలా తమపై ఐటీ దాడులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు.
దాదాపు 200 మందితో కూడా ఐటీ అధికారుల బృందం ఒకేసారి… ఢిల్లీ, ఇండోర్, భోపాల్ ప్రాంతాల్లో ఒకేసారి సోమవారం తెల్లవారుజామున ఈ దాడులను నిర్వహించారు.