అది ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎంఎంఆర్‌డీఏ)కు చెందిన స్థలం. ఆ స్థలాన్ని అమ్మడానికి ఎంఎంఆర్‌డీఏ ఇటీవలే బిడ్డింగ్ నిర్వహించింది. అయితే దేశీయ కంపెనీల్లో ఏ కంపెనీ కూడా ఆ స్థలాన్ని కొనడానికి ముందుకు రానప్పటికీ.. విదేశీ కంపెనీ సుమిటోమో ముందుకొచ్చింది.
సాధారణంగా ఎకరం జాగ ఖరీదు ఎంతుంటుంది చెప్పండి. మా.. అంటే 50 లక్షలు.. రియల్ ఎస్టేట్ బూమ్‌లో ఉంది కాబట్టి 2 నుండి 3 కోట్లు మరీ సిటీ (అంత ఖాళీ జాగ ఉంటే కదా..?) అయితే 5 కోట్ల రూపాయలు వేసుకోండి. కానీ.. అక్కడ మాత్రం ఎకరం ప్లేస్ ధర 746 కోట్ల రూపాయలు. ఎహె.. ఊరుకోండి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లిహిల్స లాంటి ఖరీదైన ప్రాంతాల్లో కూడా అంత ధర లేదు. ఆ భూమిలో ఏమన్నా వజ్రాలు, వైడూర్యాలు పొదిగి ఉన్నాయా? అని అనకండి.
నిజంగానే ఆ భూమి బంగారం. అంటే బంగారం లాంటి భూమి అన్నమాట. ఇంతకీ ఆ జాగ ఎక్కడుందో తెలుసా? ముంబైలో. అవును.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్లేస్ ముంబైలోని బాంద్రా ఏరియా. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అక్కడ చిన్న ఫ్లాట్ తీసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న ప్లాట్‌కే అంత ధర పలికింది. అంత ఖరీదు పెట్టి కూడా కొనడానికి జపాన్‌కు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ సుమిటోమో ముందుకొచ్చింది.
మొత్తం అక్కడ మూడెకరాల స్థలం ఉందట. మూడెకరాల స్థలాన్ని 2,238 కోట్లకు కొనడానికి ఆ కంపెనీ ముందుకొచ్చింది. అంటే ఎకరం స్థలం ఖరీదు 746 కోట్లు అన్నమాట. ఇక ఈ స్థలం రిలయెన్స్ కంపెనీ జియో గార్డెన్స్ పక్కనే ఉంటుందట. అందుకే.. దానికి అంత ఖరీదు పెట్టి కూడా తీసుకోవడానికి జపాన్ కంపెనీ సిద్ధమైంది.
అది ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎంఎంఆర్‌డీఏ)కు చెందిన స్థలం. ఆ స్థలాన్ని అమ్మడానికి ఎంఎంఆర్‌డీఏ ఇటీవలే బిడ్డింగ్ నిర్వహించింది. అయితే దేశీయ కంపెనీల్లో ఏ కంపెనీ కూడా ఆ స్థలాన్ని కొనడానికి ముందుకు రానప్పటికీ.. విదేశీ కంపెనీ సుమిటోమో ముందుకొచ్చింది.
టోక్యో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సుమిటోమో 1919లో ఏర్పాటైంది. ఈ కంపెనీకి జపాన్‌తో పాటు ఆసియా, యూరప్, అమెరికా, ఆఫ్రికా దేశాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి. కన్‌స్ట్రక్షన్ సిస్టమ్స్, మినరల్స్, ఎనర్జీ, కెమికల్స్, మెటల్ ప్రొడక్ట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంటి విభాగాల్లో సుమిటోమో సేవలు అందిస్తోంది.