మీ భార్యతో ఎక్కువగా డబ్బు సమస్యలు వస్తున్నాయా..? అయితే ఇలా చేయండి..!

-

భార్యాభర్తలు కలిసి ఉంటే జీవితాంతం హాయిగా ఉండొచ్చు. భార్య భర్తలు కొన్ని కొన్ని విషయాల్లో గొడవలు పడుతూ ఉంటారు. వాటిని పెద్దవి అవ్వకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ఉండాలి. చాలామంది భార్య భర్తల మధ్య డబ్బుకి సంబంధించిన విషయాల్లో గొడవలు వస్తూ ఉంటాయి. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ రాకుండా ఉండాలంటే ప్రశాంతంగా ఇద్దరు ముందు డబ్బు గురించి మాట్లాడుకోవాలి. మనకు వచ్చే ఆదాయం ఎంత?, అప్పులు ఇటువంటి విషయాల గురించి ఒకరితో ఒకరు మాట్లాడకోవాలి. అప్పుడు గొడవలు అవ్వకుండా ఉంటాయి. ప్రతి నెల కూడా డబ్బులు విషయంలో ఒక బడ్జెట్ చేయాలి.

ఖర్చులు ఎంత ఉంటాయి, ఎంత మిగిలింది, ఇంకా ఏం కట్టాలి ఇటువంటివన్నీ కూడా కూర్చుని ప్లాన్ చేసుకోవాలి అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు రావు. బడ్జెట్ లో ఇద్దరు కూడా తమకంటూ కొంచెం డబ్బులు ఉంచుకోవాలి నెలవారీ ఖర్చులు ఇష్టాఇష్టాలు ఇలా ప్రతి దానికి కూడా కొంత అమౌంట్ ని ఉంచుకోవాలి. దీంతో నెల మొత్తం ఖర్చులు అందులోనే అయ్యేటట్టు చూసుకోవాలి. మీరు కేటాయించిన దాని కంటే ఎక్కువ ఖర్చు చేయడం వలన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కొంత డబ్బుని సేవింగ్స్ చేయాలి.

డబ్బుని అదా చేయడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. భవిష్యత్తులో ఆపద నుంచి మిమ్మల్ని డబ్బు కాపాడుతుంది. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో కొంచెం డబ్బులు వేసుకోండి. ఆరు నెలల వరకు ఎలాంటి జీతం లేకపోయినా ముందుకు వెళ్లేటట్టు ఉండాలి. అలాగే రిటైర్మెంట్ అయ్యాక ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పటిదాకా ఎంత పోగు చేశామనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటితో ఏం చేయాలి అనేది కూడా మీరు ఒక నిర్ణయానికి రావాలి ఇలా భార్యాభర్తలు ఇద్దరు కూడా డబ్బులు గురించి మాట్లాడుతున్నట్లయితే ఎలాంటి సమస్య ఉండదు గొడవలు కూడా రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version