జపాన్ లోని ఓ టౌన్ కు ఏం పేరు పెట్టారో తెలిస్తే మీరు షాకవడం ఖాయం!

-

అది జపాన్ లోని కిచిజోజి. జపాన్ రాజధాని టోక్యోకు దగ్గర్లో ఉంటుంది ఈ పట్టణం. కిచిజోజి అంటే జపనీస్ లో లక్ష్మీదేవి ఆలయం అని అర్థం. అవును. షాక్ కాకండి. మన లక్ష్మీదేవి పేరే. లక్ష్మీదేవి తెలుసు కదా. ప్రతి ఇంట్లో సిరులు కురిపించేది లక్ష్మీదేవి అని అందరికీ తెలిసిందే. భారతీయులు కొలిచే లక్ష్మీదేవికి, జపాన్ కు అసలేంటి సంబంధం అని డౌటొచ్చిందా? అయితే.. ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం పదండి..

జపనీస్ భాషలోని దాదాపు 500 పదాలకు సంస్కృతం, తమిళం మూలాలు ఉన్నాయట. అంతే కాదు.. జపాన్ లో హిందూ దేవుళ్లు, దేవతలకు సంబంధించిన గుళ్లు కూడా చాలా ఉన్నాయట. చాలా తరాల నుంచి హిందూ దేవతలను జపనీయులు పూజిస్తున్నారట. అలాగే.. కిచిజోజి అనే పేరును ఓ పట్టణానికి పెట్టారట. ఎప్పుడో ఈ పట్టణానికి పేరు పెడితే.. ఇప్పుడెలా తెలిసిందనేగా మీ డౌట్. ఈ విషయాలన్నింటినీ కాన్సుల్ జనరల్ ఆఫ్ జపాన్ తకయుకి కిటాగవా చెప్పాడు.

రీసెంట్ గా బెంగళూరుకు వచ్చిన తకయుకి ఓ కాలేజీ గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొన్నాడు. ఈసందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించాడు. అప్పుడు ఇండియా, జపాన్ కు మధ్య ఉన్న బంధాలు, సంస్కృతికి గురించి చాలా విషయాలు చెప్పాడు. జపాన్ సంస్కృతిపై భారత్ ప్రభావం చాలా ఉందని ఆయన తెలిపాడు. జపాన్ డిష్ సుషి తెలుసు కదా.. ఎంత ఫేమస్సో.. దాన్ని బియ్యం, వెనిగర్ తో తయారు చేస్తారు. సుషిని షరి అని కూడా పిలుస్తారు. షరి అంటే సంస్కృతంలో అన్నం అని అర్థం.. అంటూ ఆయన వెల్లడించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version