కర్ణాటకలో ఏప్రిల్ 18న జరగబోతున్న లోక్ సభ ఎన్నికల్లో ద్రవిడ్ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. కర్ణాటక మొత్తం తిరుగుతూ అందరినీ ఓటేయాలని చెప్పే ద్రవిడ్ కు ఓటు హక్కు లేకపోవడంపై అంతటా చర్చనీయాంశమైంది.
కర్ణాటక ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్, టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తన ఓటును వేయలేకపోతున్నారు. ఎందుకంటే.. ఆయనకు ఓటు లేదు. అవును.. మీరు చదివింది నిజమే. అయ్యో.. ఆయన ఎన్నికల ప్రచార కర్త కదా. ఆయనకే ఓటు లేదా? అని నోరెళ్లబెట్టండి. ఓటరు లిస్ట్ నుంచి ఆయన పేరును తొలగించారు. ద్రవిడ్ తన అడ్రస్ మార్చుకున్నారట. దాని కోసం ఫామ్ 7 నింపారట. దాని వల్ల ఆయన ఓటు పోయిందట. అయితే.. ద్రవిడ్ మళ్లీ ఫామ్ 6 తో తన పేరును నమోదు చేసుకోవడంలో కొంచెం అశ్రద్ధ వహించడంతో ఆయన ఓటు లిస్టులో ఎక్కలేదు.
దీంతో కర్ణాటకలో ఏప్రిల్ 18న జరగబోతున్న లోక్ సభ ఎన్నికల్లో ద్రవిడ్ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. కర్ణాటక మొత్తం తిరుగుతూ అందరినీ ఓటేయాలని చెప్పే ద్రవిడ్ కు ఓటు హక్కు లేకపోవడంపై అంతటా చర్చనీయాంశమైంది.
అయితే… ద్రవిడ్ విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఫామ్ 7 ను సబ్మిట్ చేసి ఓటు తొలగించారట. తర్వాత ఫామ్ 6 ని మాత్రం ఆ ఓటరే నింపి అందజేయాల్సి ఉంటుంది. గడువు కంటే ముందే ఫామ్ 6 ను ద్రవిడ్ సబ్మిట్ చేయలేకపోయారట. దీంతో ఆయనకు ఈసారి ఓటు హక్కు రాలేదు. అది అసలు సంగతి. కాకపోతే.. తర్వాత మళ్లీ ద్రవిడ్ తన పేరును ఓటరు లిస్ట్ లో ఎక్కించుకోవచ్చు. కానీ.. ఈ ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటేయలేరు.