వైరల్ వెడ్డింగ్ ఫోటోషూట్.. అద్భుతమైన ఫోటోలు తీయడం ఇంత కష్టమా? వీడియో

-

ఈ జనరేషన్ వేరు. సాధారణంగా పెళ్లిలో తీసే ఫోటోలు, వీడియోలు వాళ్లకు ఎక్కడ సరిపోతాయి. అందుకే.. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లు, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ లు అంటూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.

పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు.. ఆ పెళ్లిని జ్ఞాపకంగా మలుచుకోవాలి కదా. పది కాలాల పాటు పెళ్లికి సంబంధించిన మధురమైన క్షణాలు మదిలోనే ఉండాలి కదా. పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి వస్తుంది. అందుకే.. ఆ తంతు అనేసరికి చాలామంది ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తారు. కొందరైతే.. కేవలం ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికే పెళ్లి చేసుకుంటారు.

ఈ జనరేషన్ వేరు. సాధారణంగా పెళ్లిలో తీసే ఫోటోలు, వీడియోలు వాళ్లకు ఎక్కడ సరిపోతాయి. అందుకే.. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లు, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ లు అంటూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.

ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటేనే మనం కేరళ గురించి మాట్లాడుకోవాలి. కేరళలో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసమే సపరేట్ గా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఇదివరకే చాలామంది వెడ్డింగ్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ.. ఈ జంట వెడ్డింగ్ ఫోటోషూట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాదు… ఏకంగా బీబీసీ ఆ జంటపై స్టోరీ చేసింది. అందుకే.. ఇప్పుడు ఆ జంట టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.

వాళ్లే కేరళలోని అలప్పుజాకు చెందిన అభిజిత్, నయన. వాళ్ల ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ను చూస్తే వావ్.. అనిపిస్తుంది. కానీ.. ఆ ఫోటోషూట్ అంత అద్భుతంగా రావడానికి ఫోటోగ్రాఫర్స్ కానీ.. ఆ జంట కానీ.. ఎంత కష్టపడారో తెలిస్తే నోరెళ్లబెడతారు మీరు.

ఒక్కరోజు ఫోటోషూట్ కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మరీ వాళ్లు ఫోటోషూట్ ను చేయించారు. ఇంతకీ వాళ్ల ఫోటోషూట్ ఎలా ఉందో… ఆ ఫోటో షూట్ కోసం ఎంత కష్టపడ్డారో అన్నీ ఈ వీడియోలో చూసేయండి.


(Video Courtesy: BBC)

Read more RELATED
Recommended to you

Latest news