అన్ని ప్రాంతాల కంటే కృష్ణా జిల్లా పాములు విషపూరితమా…?

-

కృష్ణా జిల్లాలో పాములు అంటే చాలు భయపడిపోతున్నారు జనం. వర్షా కాలం పొలాల్లోకి వెళ్ళాలి అంటే చాలు వాళ్లకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో రైతులు పాముల దెబ్బకు పొలాల్లోకి వెళ్ళడమే మానేశారు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, కైకలూరు, గుడివాడ ప్రాంతాల్లో పాములు స్వైర విహారం చేస్తున్నాయి. అన్ని కూడా విషపూరితమైన పాములే కావడంతో జనం అడుగు తీసి అడుగు వేయడానికి వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక పాము కాట్ల కేసులు ఇక్కడ భారీగా నమోదు అవుతున్నాయి. పంటల సీజన్ కావడంతో రైతులు పొలాల్లోకి ఎక్కువగా వెళ్తున్నారు. అందుకే ఇక్కడ పాము కాట్ల కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వీరిలో కొందరు బ్రతికి బట్టకడితే మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇక్కడ వైద్యులు ఒక సంచలన విషయాన్ని చెప్పారు. పాము విషం… బాధితుడికి వేగంగా ఎక్కుతుంది… ఎక్కడా లేని విధంగా పాము విషం ఇక్కడ వేగంగా పని చేస్తుందని… అందుకే మరణాల శాతం కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పారు…

దీనికి కారణం ఏంటి…? కృష్ణా నదికి వస్తున్న నీళ్ళే కారణమని అంటున్నారు కొందరు. వర్షాలు మహారాష్ట్ర, కర్నాటక అటవీ ప్రాంతాల్లో భారీగా పడటంతో అక్కడి పాములు వరదల్లో ఎక్కువగా కొట్టుకు వస్తున్నాయని… వాటి మీద పంటలకు కొట్టే క్రిమి సంహారక మందుల ప్రభావం ఉండటం లేదని, సాధారణంగా ఇతర ప్రాంతాల్లో ఉండే పాములకు ఇంత విషం ఉండదని అంటున్నారు. పంటలకు పిచికారి చేసే క్రిమిసంహారాలు వాటి మీద పడటం లేదట… నేరుగా అడవుల్లో నుంచి నీటిలో కొట్టుకు రావడంతో వాటి విష ప్రభావం స్వతహాగా ఉంటుందని, పంటలకు కొట్టే క్రిమిసంహారాలు వాటి మీద పడితే విషం తగ్గుతుందని అంటున్నారు… అందుకే కృష్ణా జిల్లాలో ఉండే పాములకు విషం ఎక్కువని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news