ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అయ్యారా? బాస్ ముందు ఎలాంటి మాటలు మాట్లాడకూడదో తెలుసుకోండి.

-

సాధారణంగా కొత్తగా ఉద్యోగం ( Jobs )లో జాయిన్ అయిన వారిలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. కొత్త ఆఫీసు, కొత్త వాతావరణం, కొత్త మనుషులు.. అంతా ఒకరకంగా అనిపిస్తూ ఉంటుంది. ఐతే ఇలాంటి టైమ్ లో బాస్ తో ఎలా ఉండాలో పెద్దగా అర్థం కాదు. ఏం మాట్లాడితే ఎలా ఉంటుందో! దేనికి బాస్ కోప్పడతాడో వంటి విషయాలు పెద్దగా తెలియవు. సీనియర్లు కూడా ఇలాంటి విషయాలు చెప్పరు. అందుకని మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బాస్ తో రిలేషన్ షిప్ బాగుండాలంటే ఎలాంటి మాటలు మాట్లాడకూడదో తెలుసుకోండి.

ఉద్యోగం | Jobs

మేబీ, సూన్, అవుతుండవచ్చు

మీ బాస్ మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ అడిగినపుడు ఆన్సర్ కూడా డైరెక్టుగా ఇవ్వాలి. నిర్ణయాలు తీసుకునేవారిని బాస్ లు ఇష్టపడతారు. అంతేకానీ, ఏమో అవుతుండవచ్చు, తొందరలో అయిపోవచ్చు వంటి మాటలు మాట్లాడవద్దు.

అది నా పని కాదు

మీకు ఆ పని పూర్తిగా రాదని అనుకున్నప్పుడే దాన్ని వదిలేయండి. అంతేకానీ, కొన్ని కొన్ని విషయాల్లో నా పని కాదని తప్పించుకోవడం బాసులకు నచ్చదు.

నేను నీతో చేయలేను

పనిలో మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు నేను చేయలేను అని చెప్పకండి. కావాలంటే ఈ పనికి మీ సాయం కావాలని అడగండి. అలా అని మీరు ఖచ్చితంగా సాయం చేయాలి ఆదేశాలు జారీ చేయవద్దు.

నేను ప్రయత్నిస్తాను

ప్రయత్నిస్తానని చెప్పడంలో నా వల్ల కాదు అని వినిపిస్తుంటుంది. అందుకే ఇతర పదాలను వెతుక్కోండి. ఖచ్చితంగా చేస్తానని చెప్పడమే కరెక్ట్. అది మీ ప్రయత్నంలోని నమ్మకాన్ని తెలియజేస్తుంది.

చాడీలు అస్సలు చెప్పవద్దు

అతడు అసలు పనే చేయడు. ఈమెకి కొంచెం కూడా పని రాదు వంటి ప్రచారాలు బాస్ తో చేయవద్దు. బాస్ స్టార్ట్ చేసినా కూడా టాపిక్ మార్చేయడమే మంచిది. అనవసరంగా చిక్కుల్లో పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version