అప్పటివరకూ ప్రశాంతంగా సాగిపోతున్న జీవితాన్ని అతలాకుతలం చేసే లే ఆఫ్స్ వల్ల ఇబ్బంది పడని వారు ఎవ్వరూ ఉండరు. పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ కంపెనీలో అంతర్గత వ్యవహారాల్లో మార్పుల కారణంగా పనిలోంచి తీసేయడం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతుంటారు.
లే ఆఫ్స్ కారణంగా ఒక్కసారిగా సర్వైవల్ మీద దెబ్బ పడుతుంది. కొందరైతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ముఖ్యంగా డబ్బు సమస్య అధికమవుతుంది. అయితే లే ఆఫ్స్ గురించి బాధపడుతూ కూర్చోవడం కరెక్ట్ కాదు. లే ఆఫ్స్ కారణంగా ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం.
ఎమర్జెన్సీ ఫండ్ చెక్ చేయండి:
ఎమర్జెన్సీ కోసం దాచిన అమౌంట్ ఎంత ఉందో చెక్ చేయండి. దాని ద్వారా ఎన్ని రోజులు శాలరీ రాకపోయినా మీరు నెట్టుకురాగలరో చూడండి. ఎమర్జెన్సీ ఫండ్ అయ్యేలోపు డబ్బులు సంపాదించే కొత్త మార్గం వెతుక్కునేందుకు ప్రయత్నించండి.
అనవసర ఖర్చులకు ఫుల్ స్టాప్:
జాబ్ లేదు కాబట్టి అనవసర ఖర్చులు తగ్గించండి. అవసరమైన దానికి ఖర్చు చేయడానికి జేభులోంచి అమౌంట్ తీయండి. క్రెడిట్ కార్డ్ బిల్స్, లోన్ ఈఎమ్ఐ వంటి వాటిని చెల్లించేందుకు అమౌంటుని వాడండి.
ఆదాయ మార్గాలు వెతకండి:
డబ్బు సంపాదించే కొత్త మార్గాలు కనిపెట్టండి. సపోజ్.. మిమ్మల్ని సాఫ్ట్ వేర్ జాబ్ లోంచి తీసేసారు అనుకుందాం. వెంటనే మీకు ఇంకో సాఫ్ట్ వేర్ జాబ్ దొరక్కపోవచ్చు. అప్పటివరకూ మీ ఖర్చులకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి.. మీకున్న హాబీస్ తో డబ్బు సంపాదించే మార్గాలను కనిపెట్టండి. ఉదాహరణకు, మీరు కంటెంట్ రైటింగ్ చేయవచ్చు, వీడియో ఎడిటింగ్ వంటి వాటివైపు వెళ్ళవచ్చు.
సహాయం అడిగేందుకు వెనక్కి రాకండి:
మీకు తెలిసిన వాళ్ళకు కాల్ చేసి, జాబ్ పోయిన విషయం చెప్పి.. కొత్త జాబ్ చూడమని అడగండి. మొహమాటంతో సైలెంట్ గా కూర్చుంటే ఆ జాబ్ వేరే వాళ్ళకు పోయే ప్రమాదం ఉంది.