చంద్ర గ్రహణం, సూర్య గ్రహణం వంటి వాటికి శాస్త్రీయంగా ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం లో కూడా కొన్ని కారణాల వలన గ్రహణం అనేది ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే రాహుకేతువులు చంద్రుడిని మింగడానికి ప్రయత్నిస్తారో అప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది అని చాలా శాతం మంది నమ్ముతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం కూడా ఏర్పడుతుంది అని పండితులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తిగా చూసేయండి.
రాహు కేతువులు నీడ గ్రహాలు అని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటి వలన గ్రహణాలు ఏర్పడతాయి. అయితే శాస్త్రీయంగా చూసుకుంటే చంద్రుడు భూమి మరియు సూర్యుడు ఎప్పుడైతే సరళరేఖలో ఏర్పడతాయో అప్పుడు సూర్యకాంతి భూమి పై పడడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో చంద్రుడి పై ఎటువంటి కాంతీ పడదు అప్పుడే చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో భాద్రపదం మాసంలో పౌర్ణమి నాడు రెండవ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అయితే పౌర్ణమి సెప్టెంబర్ 7వ తేదీన రావడం జరిగింది. ఆరోజున చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
అంతేకాకుండా సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడిన గ్రహణం సెప్టెంబర్ 8 అర్ధరాత్రి వరకు ఉండబోతోంది. అయితే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇదే రోజున బ్లడ్ మూన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే చంద్రుడు పూర్తిగా భూమి నీడలో ఉండడం వలన ఎరుపు లేక నారింజ రంగులోకి మారడం జరుగుతుంది. అందువలన సెప్టెంబర్ 7వ తేదీన బ్లడ్ మూన్ కనబడుతుంది. భారతదేశంలో మాత్రమే కాకుండా ఆసియా, యూరప్, అంటార్టికా, పసిఫిక్ మహాసముద్రం మరియు హిందూ మహాసముద్రంలో కూడా ఈ చంద్ర గ్రహణం కనిపిస్తుంది.