‘నా భార్య కొడుతోంది.. కేసు పెట్టొచ్చా?’.. మోదీకి ఓ భర్త ట్వీట్

-

గృహ హింస అనగా సాధారణంగా గుర్తొచ్చేది ఇంట్లో పురుషులు స్త్రీలను వేధించడం కొట్టడం. కొన్నిసార్లు అది శ్రుతిమించి పాశవిక దాడికి కూడా దారితీయడం. ఇలాంటి దుస్థితి ఎదుర్కొనే మహిళలు ఇంట్లో వాళ్లకో పోలీసులకో ఫిర్యాదు చేస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి తన భార్య తనను కొడుతోందని ఫిర్యాదు చేశాడు. అది కూడా పోలీసులకు కాదు. ఏకంగా ప్రధాన మంత్రికి. అసలేం జరిగిందంటే..?

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య అనే ఓ వ్యక్తి తన భార్యపై పీఎంఓకు ఫిర్యాదు చేశాడు. ఆమె తరచూ తనను వేధిస్తోందని.. తనపై చేయి చేసుకుంటోందని ట్విట్టర్​లో తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఆమె వల్ల తన ప్రాణానికి హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆమె తనను కత్తితో గాయపరించిందని ఆరోపించాడు.

సోషల్ మీడియాలో పీఎంఓను, న్యాయయశాఖ మంత్రి కిరణ్ రిజుజు, బెంగళూరు పోలీస్ కమిషనర్​ను ట్యాగ్ చేస్తూ.. తన బాధను వెళ్లగక్కాడు. స్పందించిన కమిషనర్​ అతనికి సాయం చేస్తానని తెలిపారు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు.. ఆ వ్యక్తికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version