మెడిసిన్: టాబ్లెట్లకు రంగులు ఎందుకు ఉంటుందో తెలుసా..?

Join Our Community
follow manalokam on social media

సీజన్‌ను బట్టి ప్రతి ఒక్కరూ తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. అప్పుడు సమీప హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్‌ను సంప్రదిస్తారు. డాక్టర్ బాధితుడికి వైద్యం చేసి లాస్ట్‌లో రంగు రంగుల మెడికల్ టాబెట్లను ఇస్తాడు. రోజుకి మూడు పూటలా ఈ టాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుందని సలహా ఇస్తాడు. అయితే చాలా మందికి టాబ్లెట్ల విషయంలో అనుమానం వచ్చే ఉంటుంది. కొన్ని టాబ్లెట్లు.. ఎరుపు, నీలం, తెలుపు, గ్రీన్, గులాబీ వంటి రంగుల్లో ఎందుకు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా..? వైద్యశాస్త్రంలో ఈ రంగుల టాబ్లెట్లకు ఏమైనా కోడ్ ఉంటుందా..? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

medicine
medicine

ఈజిప్టు నాగరికత యుగంలోనే టాబ్లెట్ల వాడకం అందుబాటులోకి వచ్చింది. అప్పుడు చిన్న చిన్న గుళికలు మాత్రమే ఇచ్చేవారు. అవీ కూడా మట్టిరంగులో మాత్రమే ఉండేవి. 5000 సంవత్సరం నుంచి 20వ శతాబ్దం వరకు మెడిసిన్స్ టాబ్లెట్లు గుండ్రంగా, తెల్లగా ఉండేవి. సాంకేతిక అందుబాటులోకి రావడంతో 60వ దశకంలో కలర్ టాబ్లెట్లు ప్రారంభమయ్యాయి. 1975లో సాఫ్ట్‌జెల్ క్యాప్యూల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో మాత్రమే టాబ్లెట్లను తయారు చేసేవారు. ప్రస్తుతం మార్కెట్‌లో 80 వేల కలర్ క్యాప్యుల్స్ అందుబాటులో ఉన్నాయి.

కాలక్రమేణా మెడికల్ రంగంలో అనేక మార్పులు జరిగాయి. కొన్ని మార్కెటింగ్ కంపెనీలు తమ టాబ్లెట్‌లు అమ్ముడవడానికి కొత్త మార్గాలను ఎంచుకున్నారు. చాలా మందికి కేవలం తెలుపు రంగు టాబ్లెట్లు ఇవ్వడం వల్ల కన్ఫ్యూషన్‌కు గురయ్యేవారు. దీంతో ఏ టాబ్లెట్ వేసుకుంటే ఏం జరుగుతుందోనని భయపడేవారని యూఎస్‌లో జరిపిన ఒక పరిశోధనలో తేలింది. ఆ సర్వేలో రంగు రంగుల టాబ్లెట్ ఉంటే ఎలాంటి సంకోచం లేకుండా మెడిసిన్స్ వేసుకోవచ్చని తేలింది. ఈ కలర్ టాబ్లెట్స్‌లో చాలా మంది ఎక్కువగా మంచి నిద్రకు లేత నీలం టాబ్లెట్లు, వ్యాధి నివారణకు ఎరుపు రంగు టాబ్లెట్స్‌లను ఇష్టపడతారని తెలిసింది.

ప్రస్తుతం మార్కెట్‌లో పలు ఫార్మా కంపెనీలు తమ బ్రాండ్ లోగో, ఇమేజ్‌లను ఔషధాలు, క్యాప్యూల్స్‌పై ముద్రిస్తున్నాయి. అయితే మొదట్లో వైద్య దుకాణాల దగ్గరికి వెళ్లి టాబ్లెట్స్ కొనుగోలు చేసేవారు కాదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా అవసరం ఉండేవి. కానీ, రాను రానూ చిన్న చిన్న సమస్యలకు మెడికల్ షాపుల్లో టాబ్లెట్లు ఇవ్వడం మొదలైంది. అయితే, మెడికల్ షాపుల్లో కొన్ని రకాల మెడిసిన్స్‌కి మాత్రం కచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...