మానసిక లోపాలు శరీరానికే..మనసుకు కాదుంటోన్న డౌన్‌ సిండ్రోమ్ మోడల్ 

-

అన్నీ సరిగ్గా ఉన్న వారే… ఏదైనా చేయడానికి వందసార్లు ఆలోచిస్తారు. ఇక మానసిక, శారీరక లోపాలున్న వారు..జీవితంలో ఎదగలేరని అందరూ అనుకుంటారు..కానీ మాములు వారికంటే..వారికే ఎక్కువ ఏకాగ్రత, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయట. ఒక లోపం ఉంది అంటే..దేవుడు వారికి ఏదో అద్భుతమైన గుణం ఇచ్చి ఉంటారనేది..మనందరి నమ్మకం. ప్యూర్టోరికోకు చెందిన సోఫియా జిరౌ కూడా వీరిలో ఒకరే. పుట్టుకతోనే డౌన్‌ సిండ్రోమ్‌ బాధితురాలైన ఆమె.. శారీరక, మానసిక లోపాల్ని అధిగమించి ఇప్పుడు మోడల్‌గా ఎదిగింది. ఇక ఇటీవలే ప్రముఖ లోదుస్తుల కంపెనీ ‘విక్టోరియాస్‌ సీక్రెట్‌’కు తొలి డౌన్‌ సిండ్రోమ్‌ మోడల్‌గా ఎంపికై వార్తల్లో నిలిచింది. ఈమె జీవితం ఎంతోమందికి ఆదర్శం..
ప్రముఖ లోదుస్తుల బ్రాండ్‌ ‘విక్టోరియాస్‌ సీక్రెట్‌’ ఇటీవలే ‘లవ్‌ క్లౌడ్‌ కలెక్షన్‌’ పేరుతో ఓ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఇందుకోసం వయసు, శరీరాకృతి, చర్మ ఛాయకు అతీతంగా ఉన్న 18 మంది మోడల్స్‌ను ఎంపికచేసింది. వీరిలో డౌన్‌ సిండ్రోమ్‌ శారీరక, మానసిక ఎదుగుదలలో లోపాలుంతో బాధపడుతోన్న సోఫియా జిరౌ కూడా ఉంది. విక్టోరియాస్‌ సీక్రెట్‌కు ఎంపికైన తొలి డౌన్‌ సిండ్రోమ్‌ మోడల్‌గా ఆమె ఘనత సాధించింది సోఫియా.
సోఫియా 1996లో ప్యూర్టోరికోలో జన్మించింది పుట్టుకతోనే డౌన్‌ సిండ్రోమ్‌ బాధితురాలైన ఆమె..తన లోపాలు తన కెరీర్‌కు అడ్డంకి కాకూడదని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే భవిష్యత్తులో గొప్ప మోడల్‌గా ఎదగాలని అప్పుడే కలలు కనింది. ఆ దిశగానే అడుగులేసింది. తన 23 ఏళ్ల వయసులో న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌తో మోడలింగ్‌ స్టాట్ చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. చాలామంది తమలోని శారీరక, మానసిక లోపాల గురించి బయటికి చెప్పుకోవడానికి వెనకాడుతుంటారు. కానీ ఆ లోపాలే తనను ఈ ప్రపంచానికి కొత్తగా చూపాయని, తనలోని ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యేలా చేశాయంటోందీ మన ఈ యంగ్‌ మోడల్‌.
తను సాధించిన విజయాలే తనను ముందుకు నడిపిస్తున్నాయనీ… చాలామంది శారీరక, మానసిక లోపాలున్న వారు ఏమీ సాధించలేమన్న ఆలోచనతో తమను తామే బంధించుకుంటుంటారు. కానీ ఇది తప్పని నిరూపించాలనుకున్నాని తన మాటలతోనూ స్ఫూర్తి నింపుతోందీ ‌ మోడల్‌.

ఆంత్రప్రెన్యూర్‌గా కూడా..!

 కేవలం మోడల్‌గానే కాదు.. ఆంత్రప్రెన్యూర్‌గా కూడా మారింది సోఫియా. 2019లో ‘Alavett’ (అంటే ఇంగ్లిష్‌లో I Love It అని అర్థం. ఈ పదబంధం అంటే ఆమెకు చాలా ఇష్టమట!) పేరుతో ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ స్టోర్‌ తెరిచింది. స్వతహాగా ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన ఆమె.. ఈ వేదికగా తాను రూపొందించిన దుస్తులు, యాక్సెసరీస్‌, ఇంటికి కావాల్సిన వస్తువులెన్నో విక్రయించేది.
 ప్రస్తుతం Inprende అనే ప్యూర్టోరికో కంపెనీకి రాయబారిగా కొనసాగుతోన్న ఈ బ్యూటీ.. యూరప్‌లో జరగబోయే ఫ్యాషన్ వేదికల పైనా మెరవాలనే ప్రయత్నంలో ఉంది.
 తానెంత బిజీగా ఉన్నా తన కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తానంటోంది సోఫియా. తన విజయాలకు తన తల్లిదండ్రులు, తోబుట్టువులు అందించిన ప్రోత్సాహం చాలా గొప్పదని తాను పేర్కొంది. తన ఫ్యామిలీతో గడిపిన క్షణాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోతుంటుంది.
మనం ఏదైనా సాధించాడని కృషి, పట్టుదల, చేయాలనే తపన ఉంటే చాలు..ఏదీ మనకు అడ్డుకాదు..చీకటిదారుల్లో అయినా..దీపం తోడు లేకుండా..గమ్యానికి చేరుకోవచ్చు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version