ఆ బిక్ష గాడి గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…! పోలీసులు కూడా షాక్ అయ్యారు…!

-

ఒక యాచకుడు పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. రిక్షా కార్మికుడితో గొడవ అయింది. కంప్లైంట్ ఇచ్చిన యాచకుడు ఇంగ్లీష్ లో తన కంప్లైంట్ రాసారు. ఏ ఒక్క తప్పు లేకుండా కంప్లైంట్ ని నీట్ గా ఇచ్చారు. పోలీసులు షాక్ అయ్యారు. అసలు వచ్చింది యాచకుడా కాదా అని షాకింగ్ గా చూసారు. ఆయన గతాన్ని తెలుసుకోవాలని పోలీసులు అందరూ ఆయన చుట్టూ చేరి ప్రశ్నలు అడిగారు.

ఆయన గురించి తెలిసి పోలీసులు కంగు తిన్నారు. కట్ చేస్తే ఆయన ఒక ఇంజనీర్, వయసు 51 ఏళ్ళు. పేరు గిరిజా శంకర్ మిశ్రా. తండ్రి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. బీఎస్సీ పూర్తయ్యాక.. ప్లాస్టిక్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశారు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ టెక్నాలజీ నుంచి సర్టిఫికేట్ పొందారు. తర్వాత ముంబైలో.. కొన్నిరోజులు హైదరాబాద్‌‌లో పని చేశారు. సీనియర్లతో ఉన్న గొడవల కారణంగా ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేశారు.

అక్కడి నుంచి ఆయన పూరి వచ్చేశారు. సన్యాసి దుస్తులు ధరించి, యాచకుడి అవతారం ఎత్తారు. అక్కడే ఉండిపోయి ఇన్నాళ్ళకు బయటపడ్డారు. సన్యాసిగా మారిన తర్వాత గుళ్లూగోపురాలు తిరుగుతూ దొరికింది తింటూ బ్రతుకుతున్నారు. రిక్షా కార్మికుడితో అయిన గొడవ కొట్టుకునే వరకు వెళ్ళడంతో, ప్రధమ చికిత్స అందించిన పోలీసులు ఆయన వద్ద కంప్లైంట్ తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news