ఓ అభ్యర్థి తిన్నగా పోలింగ్ బూతుల్లోకెళ్లి తన వెంట తెచ్చుకున్న పొట్లాలను తీసి… ఆ పొట్లాల్లో ఉన్న తెల్ల ఆవాలును పోలింగ్ కేంద్రాల్లో చల్లుతూ పోయాడు. ఈ ఘటన రాయలసీమలో చోటు చేసుకున్నది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటికీ… ఇంకా ఎన్నికల హడావుడి మాత్రం తగ్గలేదు. ఎవరు గెలుస్తారు. ఎవరు ఓడిపోతారు.. అనే లెక్కలు వేసుకుంటూ బిజీబిజీగా ఉన్నారు. ఎన్నికలు జరిగిన రోజున ఏపీలో ఎంత అలజడి చెలరేగిందో అందరికీ తెలుసు. సరే.. అవన్నీ పక్కన బెడితే.. తాజాగా ఓ అభ్యర్థి పోలింగ్ కేంద్రాల్లో చేసిన పని ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశమైంది.
ఓ అభ్యర్థి తిన్నగా పోలింగ్ బూతుల్లోకెళ్లి తన వెంట తెచ్చుకున్న పొట్లాలను తీసి… ఆ పొట్లాల్లో ఉన్న తెల్ల ఆవాలును పోలింగ్ కేంద్రాల్లో చల్లుతూ పోయాడు. ఈ ఘటన రాయలసీమలో చోటు చేసుకున్నది. అసలు ఈ అభ్యర్థి ఏం చేస్తున్నాడని అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్లు అవాక్కయ్యారు. అలాగే తన నియోజకవర్గంలోని అన్ని ఊళ్లలోకి వెళ్లడం.. ఆవాలును చల్లడం.. ఆ అభ్యర్థి ఇదే పని చేశాడు. కానీ.. ఓ పోలింగ్ బూత్ లో ఉన్న పోలింగ్ ఏజెంట్లు అతడిని ఏం చేస్తున్నావంటూ నిలదీసేసరికి… అవి మంత్రంచిన ఆవాలు అంటూ సెలవిచ్చాడట. వీటిని పోలింగ్ బూతుల్లో చల్లితే గెలుపు ఖాయమని ఓ స్వామి చెప్పాడని.. అందుకే అలా చేశానని చెప్పాడు ఆ అభ్యర్థి. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరో తెలియదు కానీ.. రాయలసీమలోని ఓ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేశాడట. అది సంగతి. మరి.. మనోడి మంత్రించిన ఆవాలు పని చేస్తాయంటారా? ఏమో.. ఎవరికి ఎరుక.