ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? సాక్షాత్తూ ఓ యూనివర్సిటీ వైస్ చాన్సెలర్. షాకయ్యారా? మీరే కాదు.. దేశమంతా షాకయింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం దీని మీదే చర్చ. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఉన్న వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ రాజారాం యాదవ్ ఈ మాటలను అన్నాడు. ఘాజీపూర్‌లోని ఓ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పైవిధంగా మాట్లాడాడు. విద్యార్థుల మధ్య గొడవలు జరుతాయి. అలా అని వాళ్ల చేతిలో తన్నులు తింటారా? వాళ్ల దగ్గర తన్నులు తిని నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తారా? వేరే వాళ్ల చేతిలో తన్నులు తినకండి. వాళ్లను కొట్టండి. చంపేయండి. ఏదైనా అయితే తర్వాత చూసుకుందాం. అనడంతో విద్యార్థులంతా ఒక్కసారిగా చప్పట్ల మోత మోగించారు.
అయితే.. రాజారాం ప్రసంగంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. దేశంలోని పలు రాజకీయ నాయకులు ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. ఒక వైస్ చాన్సెలర్ పదవిలో ఉండి ఇలా విద్యార్థులను మిస్‌లీడ్ చేయడమేందని ఆయనపై మండిపడుతున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా.. వైస్ చాన్సెలర్ వ్యాఖ్యలను విమర్శిస్తూ ట్వీట్ చేశాడు.