వాస్తు: పడకగదిలో ఈ విషయాలను మర్చిపోవద్దు …?

Join Our Community
follow manalokam on social media

మన ఇంట్లో ఉండే బెడ్ రూమ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వధూవరులకి ఎప్పుడైనా ఏమైనా చిన్న తగాదా జరిగితే దాని మీద ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఏమైనా ఇబ్బందులు పదేపదే ఎదుర్కుంటూ ఉంటే ఆ గది లో ఏదైనా సమస్య ఉందేమో లేదంటే ఏదైనా ఇబ్బంది వస్తుంది ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ బెడ్రూంలో ఉంటే కచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాలి అని అంటున్నారు జ్యోతిష్యులు మరియు వాస్తు నిపుణులు.

అలానే బెడ్ రూమ్ లో కొన్ని ఉంచకూడదు అని చెబుతున్నారు. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మిక పుస్తకాలు, దేవుడి ఫోటోలు- శుక్రుడి ప్రవేశం శుక్రుడు ఆనందానికి సూచన. బృహస్పతి భార్య ని సూచిస్తుంది. అది చెడ్డ ఫలితాలని చూపిస్తుంది. ఒకవేళ కనుక మీ బెడ్ రూమ్ లో మతపరమైన పుస్తకాలు, ధర్మ గ్రంధాలు ఉంటే వాటిని తొలగించండి. ఇది శుక్రుడిని సురక్షితంగా ఉంచుతుంది.

మీ మంచం పైన కనుక నల్ల బెడ్ షీట్ ఉంటే దీనిని ఉపయోగించకండి. లేదా ఎవరైనా మీకు గిఫ్ట్ ఇచ్చిన బెడ్ షీట్ ఉంటే దానిని కూడా మీరు ఉపయోగించకండి. అలానే నల్ల బెడ్ షీట్ ని ఉపయోగించడం కూడా మానేయండి. లేదు అంటే భార్య భర్తల సంబంధం లో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎప్పుడు రంగు బెడ్ షీట్స్ ని మాత్రమే వాడండి.

చాలా మంది తాజ్ మహల్ ని ప్రేమకు చిహ్నంగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని బెడ్ రూమ్ లో పెట్టుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ కనుక మీ బెడ్ రూమ్ లో అది ఉంటే దాని తొలగించండి. వాస్తు ప్రకారం దానిని బెడ్ రూమ్ లో ఉంచడం మంచిది కాదు అని పండితులు అంటున్నారు.

మీ జీవితం సరిగా సక్రమంగా ఉండాలి అంటే ఏదైనా బాధాకరమైన బొమ్మలు లేదా పెయింటింగ్ ని పెట్టుకోకండి. అటువంటి డిప్రెషన్ కలిగించే పెయింటింగ్లు పెట్టుకోవద్దు. అలానే మంచం వెనకాల ఉండే బాక్స్ లో ఎటువంటి ఎలక్ట్రానిక్ సామాన్లు పెట్టకండి. ముఖ్యంగా దీపావళి సమయంలో మనం వీటిని కొనుగోలు చేస్తూ ఉంటాం. అటువంటి వాటిని మంచం వెనకాల ఉండే బాక్స్ లో పెట్టొద్దు అని పండితులు అంటున్నారు.

అయితే ఏమి పెట్టుకోవచ్చు అనే విషయానికి వస్తే… బెడ్రూంలో ప్రేమ పక్షులు పెట్టుకోవచ్చు దీని వల్ల భార్యా భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. పైగా ఇది ప్రేమకు సంకేతం. ఒకవేళ భార్యాభర్తల మధ్య టెన్షన్ ఎక్కువగా ఉంది అంటే బెడ్ రూమ్ లో కర్పూరాన్ని వెలిగించండి. అది కూడా నిద్ర పోయే ముందు వెలిగిస్తే మంచిది.

TOP STORIES

సంస్కృతం నేర్చుకోవాల‌నుకునే వారి కోసం.. కేంద్ర ప్ర‌భుత్వం కొత్త యాప్‌..!

సంస్కృతం భాష‌ను దైవ భాష అంటార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ భాష నుంచే అనేక భార‌తీయ భాష‌లు వ‌చ్చాయ‌ని నిపుణులు చెబుతుంటారు. అయితే ప్ర‌స్తుత...