ప్రముఖ టెలికాం కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు తమ నెట్వర్క్ కి వినియోగదారులను పెంచుకునే పనిలో పడ్డాయి. పోటీ ఎక్కువగా ఉండటంతో మార్కెట్ లో నిలబడటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. గతంలో భారీగా ఉండే ధరలను ఇప్పుడు తగ్గించి వినియోగదారులకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి టెలికాం కంపెనీలు. ఇక ఈ క్రమంలోనే సిగ్నల్ ని నిరంతరాయంగా ఏ ఇబ్బంది లేకుండా అందించడానికి గానూ…
సెల్ టవర్ల సంఖ్యను కూడా పెంచేస్తున్నారు. ఐడియా, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ సంస్థలు వినియోగదారులకు మెరుగైన సిగ్నల్ అందించడానికి టవర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో భారి ఆపార్ట్మెంట్ లను, మోస్తారు ఇళ్ళను అద్దెకు తీసుకుని వాటిపై సెల్ టవర్ ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాటిని తమ ఇంటి మీద నుంచి తొలగించమని తమకు అద్దె కూడా అవసరం లేదని ఇంటి యజమానులు గొడవ చేస్తున్నారట… దీనికి కారణాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే…
ఇంటి మీద ఇది వరకు పచ్చటి వాతావరణం ఉండేదని, దీనితో భారీగా పక్షులు వచ్చి సందడి చేస్తూ ఉండేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేక తమ ఇల్లు బోసి పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా టవర్ల ఏర్పాటు కారణంగా వచ్చే రేడియేషన్ తో పక్షులు చనిపోవడమే కాకుండా తమకు తల నొప్పి కూడా వస్తుందని వారు అంటున్నారు. దీనితో ఇప్పుడు చాలా మంది అద్దె రాకపోయినా పర్వాలేదు తమ ఇంటి మీద టవర్ వద్దని చెప్పెస్తున్నారట. దీనితో ఈ పరిణామం ఇప్పుడు టెలికాం కంపెనీలకు ఇబ్బందిగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉందట.