నోమోఫోబియా : ఫోన్‌ వాడకుండా అసలు ఉండలేకపోతున్నారా.. మీకు ఆ వ్యాధి వచ్చేసిందా..?

-

ఉదయం లేవగానే ఫోన్‌ చూసే అలవాటు మనలో చాలామందికి ఉంటుంది. ఎవరు మెసేజ్‌ చేశారు, ఎవరు కాల్‌ చేశారో చూస్తే కానీ మనకు ప్రశాంతంగా ఉండదు. ఇంక టైమ్‌ ఉంటే బెడ్‌ మీదే టైమ్‌పాస్‌ చేస్తాం. ఫోన్‌ వాడేవాళ్లు రకరకాల మెంటాలిటీ వాళ్లు ఉంటారు.. అవసరానికి మాత్రమే ఫోన్‌ వాడటం, అవసరం లేకుండా టైమ్‌ దిరికితే చాలు అందులోనే ఉండటం. ఇక మూడో రకం వీళ్లు అసలు ఫోన్‌ లేకుండా ఉండలేరు..పది నిమిషాలు కూడా ఫోన్‌ లేకుండా గడపలేరు. వీధి చివర కిరాణా షాప్‌ వరకూ వెళ్లాలన్నా ఫోన్‌ కావాల్సిందే.. ఇలా ఫోన్‌ ఎడిక్ట్‌ అవడాన్నే నోమోఫోబియా అంటారు. దీనివల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

నోమోఫోబియా అంటే ఏమిటి?
తమ మొబైల్ ఫోన్‌ల నుంచి దూరంగా ఉండాల్సి వస్తుందేమోననే కలిగే భయాన్నే నోమోఫోబియా అంటారు. ఇది మానసిక స్థితి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక రకమైన ఆందోళన రుగ్మతగా చెప్పవచ్చు. ఈ సమస్య ఉన్న వ్యక్తులు తమ ఫోన్‌లలో బ్యాటరీ అయిపోయినప్పుడు, సెల్యులార్ కవరేజ్ లేనప్పుడు లేదా ఫోన్ పోయినప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతారు.

ఈ పదం ఎక్కడది?
నోమోఫోబియా మొదటిసారిగా UK పోస్టల్ ఆఫీస్ ద్వారా 2008 అధ్యయనంలో ఉపయోగించారు. 2100 కంటే ఎక్కువ మంది పెద్దల నమూనాను తీసుకున్న ఈ అధ్యయనంలో 53% మంది ఈ పరిస్థితిని అనుభవించారని తేలింది. ఈ భయం చాలా శక్తివంతమైనదని.. వారి ఫోన్‌ను ఆఫ్ చేయడం అసాధ్యం అని కూడా అధ్యయనం వెల్లడించింది.

ఈ సమస్య సంకేతాలు, లక్షణాలు ఏమిటంటే..
ఫోన్‌ని ఆఫ్ చేయలేకపోవడం, మిస్డ్ కాల్‌లు, మెసేజ్‌లు లేదా ఇమెయిల్‌ల కోసం మీ ఫోన్‌ను నిరంతరం తనిఖీ చేయడం లేదా ఇంటర్నెట్ నుంచి డిస్‌కనెక్ట్ కావడం గురించి ఆందోళన చెందడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
భావోద్వేగ, అభిజ్ఞా లక్షణాలతో పాటు.. బ్రీతింగ్ సమస్యలు, హృదయ స్పందన రేటు పెరగడం
విపరీతమైన చెమటను మీరు అనుభవించవచ్చు.
తీవ్రమైన సందర్భాల్లో ఇది తీవ్ర భయాందోళనలకు కూడా దారి తీస్తుంది.

నోమోఫోబియాకు కారణం..

ఫోన్‌ను అవసరానికి మించి వాడటం.. నిజమే.. మన అవసరాలకు ఫోన్‌ కావాల్సి వస్తుంది. కానీ ఫోనే ప్రపంచం అయితే కాదు కదా.. ఫోన్‌ లేకుండా మీరు ఎలా టైమ్‌పాస్‌ చేస్తారో మీరే ఒకసారి ఆలోచించండి.. మనకు అసలు ఏం తట్టవేమో కదా..! హోమ్‌ వర్క్‌ చేయగానే ఫోన్‌. పట్టుకోవడం, వర్క్‌ అవగానే ఫోన్‌ ఇలా మనకు ఉన్న ఆ పనిని కంప్లీట్‌చేసుకుని ఫోన్‌లోనే టైమ్‌ స్పెండ్‌ చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు. ఫోన్‌పై ఎక్కువ ఆధారపడకూడదు.

దీనిని ఎలా కంట్రోల్ చేయవచ్చు..
మీరు నోమోఫోబియా సంకేతాలు, లక్షణాలను కనుగొంటే.. అది మీ రోజువారీ జీవితంలో సమస్యలను కలిగిస్తుంటే.. మీరు మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడటం మంచిది. ఈ పరిస్థితికి ప్రత్యేకంగా చికిత్స అందుబాటులో లేదు. అయితే మీ థెరపిస్ట్ మీ లక్షణాలను పరిష్కరించడానికి ఎక్స్‌పోజర్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లేదా రెండింటినీ సిఫారసు చేయవచ్చు.

వీలైనంత వరకూ ఫోన్‌ వాడకం తగ్గించండి. అసలు ఫోన్‌ లేకుండా ఒక్కరోజైనా ఉండగలరేమో మీకు మీరే బెట్‌ వేసుకోండి. ఎంత వరకూ సక్సస్‌ అవుతారో చూడండి.. ప్రయత్నించండి ఏదైనా కొత్తగా…ఫోన్‌కు దూరంగా..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version