హీరో ఎలక్ట్రిక్ కంపెనీ టూవీలర్ వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. ఏ కంపెనీకి చెందిన పెట్రోల్ టూవీలర్‌ను అయినా వారు ఎక్స్ఛేంజ్ చేసి కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకోవచ్చు. దీంతో కొత్త స్కూటర్ ధర తగ్గుతుంది. అలాగే పాత వాహనాలను సులభంగా ఎక్స్ఛేంజ్ చేయవచ్చు. ఇందుకు గాను పలు స్టెప్స్‌ను కస్టమర్లు అనుసరించాలి.
హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనదలచిన వారు ముందుగా తమ పెట్రోల్ బైక్‌కు ఎంత ధర వస్తుందో ఆన్లైన్లో తెలుసుకోవాలి. తరువాత ఆ బైక్‌ను, సంబంధిత డాక్యుమెంట్లను తమకు సమీపంలో ఉండే హీరో ఎలక్ట్రిక్ షోరూం వద్దకు తీసుకెళ్లాలి. అక్కడ క్రెడ్ ఆర్ కంపెనీకి చెందిన ప్రతినిధులు పెట్రోల్ బైక్‌ను తనిఖీలు చేసి దానికి ఎంత ధర వస్తుందో చెబుతారు. నచ్చితే ఆ బైక్‌ను అమ్మి అక్కడే కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకోవచ్చు. పాత బైక్‌కు వచ్చిన ధరను మినహాయించి కొత్త స్కూటర్‌కు మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని ఈఎంఐలలో చెల్లించేలా కూడా లోన్ సౌకర్యం ఇస్తారు. ఈ క్రమంలో వినియోగదారులు తమ పాత పెట్రోల్ బైక్‌లను సులభంగా ఎక్స్ ఛేంజ్ చేసి కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనవచ్చు.
ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసిన సందర్భంగా హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ మాట్లాడుతూ.. కరోనా లాక్ డౌన్ అనంతరం చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని, అందుకనే ఈ ప్రోగ్రామ్‌ను క్రెడ్ ఆర్ కంపెనీ భాగస్వామ్యంతో లాంచ్ చేశామని తెలిపారు. దీని వల్ల టూవీలర్ల వినియోగదారులు తమ పాత వాహనాలను సులభంగా ఎక్స్ ఛేంజ్ చేయవచ్చని, కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను సులభంగా కొనవచ్చని తెలిపారు. ఇక ఈ ప్రోగ్రామ్ ప్రస్తుతానికి ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, పూణె నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉందని, త్వరలోనే మరిన్ని నగరాలు, పట్టణాల్లో ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.