ఎక్కడికి వెళ్లినా కాకా కుమారుడిగా ఎనలేని గౌరవం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

-

కాకా స్ఫూర్తితోనే తెలంగాణ కోసం కొట్లాడామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి తెలిపారు. బాగ్ లింగంపల్లి అంబేద్కర్ కాలేజీలో కాకా వెంకటస్వామి 10వ వర్థంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ సందర్భంగాయ వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నామన్నారు. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ఈ విద్యా సంస్థలను నెలకొల్పామని తెలిపారు. విద్యతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ కోర్సు ప్రవేశపెడతామన్నారు.

vivek Venkata Swamy

తాను ఎక్కడికి వెళ్లినా.. కాకా కుమారిగా ఎనలేని గౌరవాన్ని పొందుతున్నానని తెలిపారు. అంబేద్కర్ లా కాలేజీ కి .జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందన్నారు. పట్టుదలతో క్రమ శిక్షణతో ఇక్కడ విద్యనందిస్తున్నామన్నారు. పేద విద్యార్థుల కోసమే అంబేద్కర్ కాలేజీని స్థాపించామన్నారు. ఈ కాలేజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెట్ కూడా వర్తిస్తుందన్నారు. త్వరలో అంబేద్కర్ కాలేజీ అటానమస్ కాలేజీ కాబోతుందని తెలిపారు వివేక్ వెంకటస్వామి.

Read more RELATED
Recommended to you

Exit mobile version