Water bottle: సమ్మర్ వచ్చింది.. ఇక అందరూ ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగడానికే ఇష్టపడతారు.. మార్కెట్‌లో ఒక డజన్ కొత్త బాటిళ్లు కూడా తెచ్చి ఉంటారే.. మనం కొనే వాటర్ బాటిళ్ల ధర ఎంత ఉంటుంది.. మహా అయితే 200- 500 మధ్యలో ఉంటుంది. అయితే ఈ మధ్య సెలబ్రెటీలు బ్లాక్ వాటర్ తాగుతున్నారు. దాని ధర కూడా రూ. 4000 ఉంటుంది.. కానీ మీకు తెలుసా.. ఆ వాటర్ బాటిల్ ధర.. అక్షరాల రూ.45 లక్షలు. ఏంటి నమ్మడం లేదా..? నిజమండి బాబు..!
మనిషి బతకాడనికి నీళ్లు కావాలి.. కానీ ఇప్పుడు అవే నీళ్లు స్థాయిని బట్టి మారిపోతున్నాయి.. సామాన్యుల తాగే నీళ్లు, సెలబ్రెటీలు తాగే నీళ్లు అంటూ వేరుగా ఉంటున్నాయి.. ఫిట్‌గా ఉండేందుకు, నిత్యం యవ్వనంగా ఉండేదుకు సెలబ్రెటీలు ఎంతైనా ఖర్చు పెడతారు.. అందులో భాగంగానే వాళ్లు తాగే వాటర్‌ను కూడా కాస్త ఖరీదైనదే ఎంచుకుంటున్నారు. కొంతమంది ఆల్కలీన్ వాటర్ తాగితే మరికొందరు విదేశాల నుంచి వాటర్ ఆర్డర్ చేస్తుంటారు.
ఓ బాటిల్ ధర మాత్రం ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఆ బాటిల్ వాటర్ కంటే.. మనం ఒక ఇళ్లు కొనుక్కోవచ్చు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీరు అది. హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా ఆ నీరు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటి పేరు ఆక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఏ మోడిగ్లియాని. ఈ వాటర్ బాటిల్ 2010లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌గా పేరుపొందింది. ఇది 750ml వాటర్ బాటిల్‌లోనే వస్తుంది. దీని ధర సుమారు 45 లక్షల రూపాయలు.
అక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిళ్లలో ఒకటి. ఇది సీసాలో బంగారంతో తయారు చేయబడింది. ఈ నీరు ఫ్రాన్స్ లేదా ఫిజీకి చెందినది. ఈ నీటిలో 5 గ్రాముల బంగారం కూడా కలుపుతారు. ఇది శరీరానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బాటిల్ చూడటానికి కూడా భలే ముద్దుగా ఉంటుంది.. ఇది లెదర్ ప్యాకేజింగ్‌తో తయారు చేశారు. ఈ సీసాని ఫెర్నాండో అల్టమిరానో రూపొందించారు. ఈ బ్రాండ్ అనేక సీసాలలో వస్తుంది. అరే ఇది టేస్ట్ చేయడం మన జన్మలే జరిగే పనికాదులే అనుకుంటారేమో.. మీకు ఇంట్రస్ట్ ఉంటే.. ఇది తక్కువ ధరలో కూడా వస్తుంది.. దాదాపు 21,355 రూపాయల నుంచి ఇవి మొదలువుతాయి.