కాళ్లకు వెండి పట్టీలు మాత్రమే వేసుకోవాలి.. బంగారు పట్టీలు వేస్తే ఈ సమస్య ఖాయం

-

ఆడవాళ్లు వేసుకునే నగలు కేవలం అందానికి అని చాలా మంది అనుకుంటారు.. కానీ ఒక్కో నగకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్క ఆభరణం అది ఉండే ప్రదేశాన్ని బట్టి ఆరోగ్యంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. కాలికి మెట్టెలు పెట్టడం వల్ల రుతుస్రావం సమస్య నుంచి ఉపశమనం ఉంటుంది. చెవి పోగుల వల్ల కంటిచూపు బాగుంటుంది. ఇలా ప్రతి ఆభరణం వెనుక ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది. ఇక కాలికి పట్టీలు పెట్టుకుని ఆడపిల్ల ఇంట్లో తిరిగితే లక్ష్మీ దేవి నట్టింట తిరుగుతున్నట్లు ఉందని అంటారు. పట్టీలు అంటే అందరూ వెండివే పెట్టుకుంటారు..కానీ కొంతమంది పైసలు ఉన్నాయి కదా అని బంగారుపట్టీలు చేయించుకుంటారు. అయితే కాలికి వెండి పట్టీలు మాత్రమే పెట్టాలట..! మార్కెట్‌లో దొరికే రోల్డ్‌ గోల్డ్‌వి, డిజైనరీ పట్టీలు ఇవేవి మంచివి కావు.

సంస్కృతి సంప్రదాయాల ప్రకారం.. బంగారు పట్టీలను ఎలాంటి పరిస్థితులలో కూడా ధరించకూడదు. బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు.. కనుక బంగారు పట్టీలను పాదాలకు ధరించడం వల్ల సాక్షాత్తూ అమ్మవారిని అవమానపరిచినట్లే అవుతుందని.. పండితులు అంటున్నారు.. అందుకోసమే పాదాలకు బంగారు పట్టీలు ధరించకూడదని పండితులు సూచిస్తున్నారు.. ఇక ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా వెండి పట్టీలను పాదాలకు ధరించడం వల్ల మన శరీరంలో ఉన్న వేడి మొత్తం బయటకు పోయి మన శరీరం చల్లబడుతుంది.

కానీ బంగారం మాత్రం మన శరీరానికి వేడిని కలుగచేస్తుంది. ఎట్టి పరిస్థితులలోనూ పాదాలకు వెండి పట్టీలు తప్ప బంగారు పట్టీలు ధరించకూడదు. ఆధ్యాత్మికంగాను.. ఆరోగ్యపరంగాను.. వెండి పట్టీలు శుభప్రదమని.. పండితులు తెలియజేస్తున్నారు.

వెండి మువ్వలు ధరించడం వల్ల మహిళలు మరింత ఎనర్జిటిక్ గా ఉంటారు. పట్టీలు వేసుకోవడం వల్ల పాదాలకు రక్షణ కల్పిస్తాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఆరోగ్యంగా, స్మూత్ గా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్తప్రసరణ సజావుగా జరగడానికి, పాదాలు వాపులు రాకుండా ఉండటానికి సహకరిస్తాయి. మీకు రుతుక్రమ సమస్యలు ఉంటే.. వెంటనే గజ్జెలు వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే.. ఇవి రుతుక్రమ సమస్యల నుంచి, సంతానంలో వచ్చే సమస్యల నుంచి, గర్భసంచిలో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో పోరాడుతుంది. అలాగే.. రోగనిరోధక శక్తిని కూడా వెండి పట్టీలు పెంచుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version