ఓరి దేవుడో.. ఈ ఐడియాలు ఎలా వస్తాయి రా మీకు.. వీడియో చూస్తే అస్సలు నమ్మరు..

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు దర్శనమిస్తున్నాయి..అందులో కొన్ని వీడియో వంటలతో పిచ్చెక్కిస్తున్నాయి.. అలాంటిది ఇప్పుడొక్క వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. అదేంటంటే కరెన్సీ పరోటా.. ఆ పరోటా గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మన దేశంలో పరాటాకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే..అన్ని సమయాలలోనూ అన్ని ప్రాంతాల ప్రజలు తినే ఆహారం. పరాటా ప్రేమికులు దీనిని చాలా రకాలుగా తయారు చేసి తింటారు. పిండి మధ్యలో బంగాళాదుంపను నింపి చేసే పరాటా తినడానికి చాలా మంది ఇష్టపడతారు.అలాగే పనీర్, చీజ్, గుడ్డు, ముల్లంగి, పరాఠాలను కూడా చాలా మంది ఇష్టపడతారు. అయితే కరెన్సీ నోట్లు నింపే పరటా గురించి బహుశా ఎప్పుడూ విని ఉండరు..తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతుంది..అందులో మహిళ పరాటాలో 500 నోట్లను నింపి సిద్ధం చేసింది.

సోషల్ మీడియా యుగంలో, వీడియోలను వైరల్ చేయడానికి ప్రజలు ఏదైనా చేస్తారు. ఒక చోట బిర్యానీ సమోసా తింటే మరో చోట మటన్ స్టఫింగ్ తో చేసిన సమోసా పాపులర్ అవుతోంది. ఇది కాకుండా, వెన్నతో చేసిన టీ, చాక్లెట్ ఇడ్లీ, ఇలా వెరైటీ వంటలన్నీ ఇన్ స్టా లో ఫేమస్ అవుతున్నాయి. తాజాగా 500 రూపాయల నోటుతో చేసిన పరాటా తర్వాత ఓపెన్ చేసి చూస్తే అది 2000 నోటుగా మారింది.500 నోటును పరాటాలో నింపడం దానికదే ప్రత్యేకమైనది కాబట్టి ఈ వీడియో మిలియన్ల వ్యూస్ పొందింది. అయితే ఇలా ఎందుకు జరిగిందన్న ప్రశ్న ప్రజల్లో నెలకొంది. వీడియోను ఎడిట్ చేయడంపై కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు.. మొత్తానికి ఈ వీడియో ట్రెండ్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version