పెంపుడు జంతువులుగా కుక్కులు, పిల్లలు పెంచుకుంటారు కానీ పాములు, కొండచిలువలను ఎవరైనా పెంచుకుంటారు.. అసలు అవి కనిపిస్తేనే.. చెమటలు పడతాయి.. అలాంటిది ఓ అమ్మాయి కొండచిలువతే స్నేహం చేస్తుంది. తనతోపాటు రెస్టారెంట్‌కు తీసుకెళ్లి చిన్నపిల్లలకు తినిపెట్టినట్లు ఫుడ్ తినిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. రెస్టారెంట్‌లో టేబుల్ మీద కొండచిలువ చుట్టులు వేసుకుని ఉంది.. ఛైర్‌లో కుర్చున్న యువతి దానికి చిప్స్ తినిపెడుతుంది.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం… ఓ ఇద్దరు అమ్మాయిలు డిన్నర్ చేసేందుకు రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ అమ్మాయిలు వారితో పాటుగా ఓ భారీ కొండచిలువను కూడా రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు. ఇద్దరు అమ్మాయిలు టేబుల్ ముందు కూర్చోగా.. పాము టేబుల్ పైన ఉండి అందరినీ గమనిస్తుంది.. అమ్మాయిలిద్దరూ ఫుడ్ ఆర్డర్ చేసి.. వెయిటర్ కోసం ఎదురుచూస్తుంటారు. పాము కూడా ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతలో ఫుడ్ వస్తుంది.
అమ్మాయి చాప్స్ టిక్ సాయంతో ఆహారాన్ని తీసుకొని ఆ భారీ కొండచిలువకే తినిపిస్తుంది. అమ్మాయి పెట్టే ఆహారాన్ని ఆ పాము ఎంచక్కా లాగించేస్తుంది. ఈ దృశ్యం చూసి రెస్టారెంట్‌లో ఉన్న చాలా మంది ఆశ్చర్యపోయారు.. నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి అంటారు కదా..సరిగ్గా అక్కడున్నవారిది అదే పని అయింది. పాము మాత్రం రెస్టారెంట్‌లో ఉన్న ఎవరినీ ఏమీ అనదు. ఇందుకు సంబందించిన వీడియోను ఇల్‌హనాటలే (ilhanatalay_) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. మూడు వారాల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకి దాదాపుగా లక్ష వ్యూస్ వచ్చాయి. కొంతమంది ఇది నిజం కాదు.. కంప్యూటర్ యానిమేషన్ అంటున్నారు. ఇంకొంతమంది ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్ అంటున్నారు. కొందరైతే.. వీడియో చూస్తుంటేనే భయంగా ఉంది కమెంట్ చేస్తున్నారు. వీడియోను క్షుణంగా చూస్తే..ఇది యానిమేషనేనా అని డౌట్‌గా ఉంది.. చెప్పలేం.. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం.. ఈరోజుల్లో ఏవేవో చేస్తున్నారు..అందులో భాగంగానే ఇలా క్రియేట్ చేసి ఉండొచ్చు.. మీరు కూడా. చూసి ఇది రియలా లేక ఫేక్ అనేది చెప్పండి.