విమానం ముందు టైర్ తెరుచుకోకున్నా పైలట్ చాకచక్యంతో ల్యాండింగ్.. వైరల్ వీడియో

-

ఫ్రంట్ టైర్లు తెరుచుకోకున్నా.. ల్యాండింగ్‌కు ప్రయత్నించాడు. విమానం రన్‌వేను తాకగానే.. విమానం ముందు భాగం రన్‌వేను తాకుతూ.. విమానం కూడా అలాగే ముందుకెళ్తు నెమ్మదిగా ఆగిపోయింది.

విమానం ల్యాండ్ అవ్వాలంటే విమానం టైర్లు తెరుచుకోవాలి. గాల్లో ఎగిరేటప్పుడు టైర్లు అవసరం లేదు కానీ.. రన్‌వే ల్యాండ్ అవ్వాలంటే ఖచ్చితంగా టైర్లు ఉండాల్సిందే. అయితే.. ఓ విమానం ల్యాండింగ్ గేర్లు ఫెయిల్ అయ్యాయి. దీంతో ముందు టైర్లు ఓపెన్ కాలేదు. ఈ విషయాన్ని గమనించిన పైలట్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలనుకున్నాడు.

ఫ్రంట్ టైర్లు తెరుచుకోకున్నా.. ల్యాండింగ్‌కు ప్రయత్నించాడు. విమానం రన్‌వేను తాకగానే.. విమానం ముందు భాగం రన్‌వేను తాకుతూ.. విమానం కూడా అలాగే ముందుకెళ్తు నెమ్మదిగా ఆగిపోయింది. దీంతో విమానంలో ఉన్న 89 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే బతుకు జీవుడా అంటూ విమానం నుంచి దిగేశారు.

ఈ ఘటన మయన్మార్‌లోని యాంగూన్‌లో చోటు చేసుకున్నది. యాంగూన్‌లోని మాండలే ఎయిర్ పోర్టులోనే ఈ విమానం ల్యాండ్ అయింది. మయన్మార్ ఎయిర్ లైన్స్‌కు చెందిన యూబీ 103 విమానం అది.

Read more RELATED
Recommended to you

Exit mobile version