రెండు మేకలు రూ.4 లక్షలు.. వాటి ప్రత్యేకతలు ఏంటంటే..!!

-

బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిములంతా హ్యాపీగా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే మేకలు, గొర్రెల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో రెండు మేకలకు రూ.లక్షల్లో ధర వచ్చింది. ఇంతకీ అవి ఏం తింటాయి? వాటి రోజు వారి ఖర్చు ఎంత? ఎవరు తీసుకున్నారు? తెలియాలంటే మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.

సాధారణంగా జరిగే మేకలు, గొర్రెల విక్రయాల కన్నా ఈ ఈద్ పర్వదినం రోజున కొంచెం ఎక్కువగానే సేల్స్ ఉంటాయి. ఇక విషయానికొస్తే లక్నోలో జరిగిన విక్రయాల్లో రెండు మేకలకు భారీస్థాయి ధర వచ్చింది. చూడముచ్చటగా ఉన్న ఈ మేకలను ఓ వ్యక్తి నాలుగున్నర లక్షల రూపాయలు పెట్టి కొన్నాడు. స్థానికంగా ఈ వార్త సంచలనమైంది.

లక్నోలోని గోమతి నది దగ్గర ఓ మేకల మార్కెట్‌లో వీటిని అమ్మకానికి ఉంచగా వాటికి విశేష ధర లభించింది. ఈ మేకలకు స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. రెండిటిలో ఒక మేక బరువు 170 కేజీలు. కాగా, మరో మేక బరువు 150 కేజీలు. కేవలం రెండేళ్ల వయసున్న వీటికి ప్రతీ రోజు రోజూ బాదంపప్పు, పిస్తా, బాదాములు, జీడిపప్పు, స్వీట్స్ తినిపించడంతో పాటు జ్యూసులు కూడా తాగిస్తారట. అంటే దాదాపుగా వీటికి ప్రతీ రోజు ఆరొందల రూపాయలు ఖర్చు అవుతుందని అమ్మకం‌దారుడు తెలిపాడు.

ఇక మనుషుల మాదిరిగా హెల్దీనెస్ కోసం వీటికి ప్రతీ రోజు బాతింగ్ సెషన్ కూడా ఉంటుందని చెప్పారు. ఇలా మేకలను పెంచి పోషించడం, మేపడం చూస్తుంటే సంక్రాంతి బరిలో నిలిపే పందెం కోళ్లను చూస్తున్నట్లే అనిపిస్తుందని పలువురు అనుకుంటున్నారు.
అయితే, ఈ ఈద్ సందర్భంగా దేశమంతటా జనాలు గుమిగూడగా, కొవిడ్ కేసులు బాగా పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news