పురుషులు ఎలాంటి భార్యను కోరుకుంటారు? సైకాలజీ ఏం చెప్తోందంటే?

-

సాధారణంగా అబ్బాయిలు అందరికీ అమ్మాయిలు ఎంతో అందంగా కనబడుతూ ఉంటారు. కాకపోతే కొంతమంది అమ్మాయిలను మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. ఎందుకంటే అబ్బాయిలు కొన్ని లక్షణాలు ఉండేటువంటి భార్యని మాత్రమే కోరుకుంటారు. కేవలం చూడటానికి మాత్రమే ఎంతో అందంగా కనిపించిన వారిని కాకుండా పెళ్లి చేసుకోవాలి అని అనుకునే అబ్బాయిలు వారికి తగిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. కనుక కొన్ని లక్షణాలను మాత్రం తప్పకుండా చూస్తారు. అబ్బాయిలు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికు తెలివితేటలు ఎక్కువగా ఉండాలని భావిస్తారు. అమ్మాయిలలో ఎక్కువ ప్రతిభ మరియు సామర్ధ్యం ఉంటుందో అటువంటి అమ్మాయిలు ఎంతో త్వరగా నచ్చుతారు.

కొంతమంది మహిళలు చాలా కష్టపడి తక్కువ స్థాయి నుండి మంచి స్థాయికి ఎదుగుతారు. మగవాళ్లకు అటువంటి వారు నచ్చుతారు. చాలా శాతం మంది అబ్బాయిలు ఎప్పటికీ అమ్మాయి గుణం చూస్తారు. అందంతో పాటు మహిళల్లో ఉండే మంచితనాన్ని, దయతో వ్యవహరించే తీరు, ఇతరులకు గౌరవాన్ని ఇవ్వడం వంటి లక్షణాలు ఉండే మహిళలు మగవాళ్లను ఎంతో త్వరగా ఆకర్షిస్తారు. నీతితో పాటుగా నిజాయితీ కూడా ఎంతో అవసరం అని మగవాళ్లు భావిస్తారు. ఎప్పుడైతే మహిళలలో నిజాయితీ ఉంటుందో అప్పుడు నమ్మకం కలుగుతుందని ఈ విధంగా ఇలాంటి సందేహం లేకుండా పెళ్లి చేసుకోవచ్చని అనుకుంటారు.

అబ్బాయిలు సహజంగా వారి భార్య ఒక స్నేహితురాలుగా మెలగాలని కోరుకుంటారు. దీనివలన బంధం మరింత బలపడుతుందని, అర్థం చేసుకోవడం వంటి గుణం మహిళలకు ఉంటుందని భావిస్తారు. అంతేకాకుండా మహిళలు ఎప్పుడైతే సున్నితంగా ఉంటారో, మంచి వ్యక్తిత్వం కలిగి అందరితో వ్యవహరిస్తారో అటువంటి మహిళలను పురుషులు ఎక్కువగా ఇష్టపడతారు. పురుషులు సహజంగా ఆందోళన చెందే మహిళలపై ఎక్కువ ఆసక్తి చూపించరు. ఎవరైతే ప్రశాంతంగా ఆలోచిస్తారో మరియు స్థిరమైన భావం తో ఉంటారో అటువంటి మహిళలను ఎక్కువగా ఇష్టపడతారు.

Read more RELATED
Recommended to you

Latest news