వైరల్‌ : ‘హెలికాప్టర్‌’లో పెళ్లి ‘బరాత్‌’

-

ఒకప్పుడు పెళ్లి బరాత్‌ అంటే వరుడు, వధువుల ముందు హారతి పళ్లేలాతో నడుచుకుంటే వరుడి ఇంటి వరకు వెళ్లేవారు. ఆ తర్వాత కాస్త ట్రెండ్‌ మార్చి బ్యాండ్, మ్యూజిక్‌లతో డ్యాన్స్‌లు చేస్తూ వెళ్లడం ప్రారంభించారు. ఇందులో ఇంకాస్త మార్పుచేసి వరుడు వధువులను కార్లలో కూర్చోపెట్టి తీసుకెళ్లడం చేస్తారు. రోజురోజుకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కోరికలు మార్చుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లి కొడుకు తండ్రి బరాత్‌లో ఏకంగా హెలికాప్టర్‌నే రంగంలోకి దింపి అందరిని ముక్కులో వేలేసుకునేటట్టు చేశారు. జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పైన కడుతుంది. డబ్బులు ఉంటే చాలు.. ఏమైన చేయవచ్చు అనే సామేత ఈ బరాత్‌కు సరిపోతుందని ఆ ప్రాంతం వారు గుసగుసలాడుతున్నారు.‘హెలికాప్టర్‌ వెడ్డింగ్‌’ పేరుతో ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

కొడుకు కోరిక మేరకు..

రాజస్థాన్‌ షేకావతిలో ఈ కొత్త ట్రెండ్‌ చోటు చేసుకుంది. రతన్‌ఘట్‌ నియోజకవర్గంలోని ఓ కుగ్రామంలోని ఓ కోటీశ్వరుడు తన కుమారుడి కోరిక మేరకు బరాత్‌లో ఏ బెంజీ కార్‌ పెడుతానుకుంటే ఏకంగా హెలికాప్టర్‌ను పెట్టాడు. పెళ్లి ముగిసిన వెంటనే కొత్త జంటను హెలికాప్టర్‌లో ఊరేగించారు. హెలికాప్టర్‌ గాల్లో ఎగురుతుండగా కిందనుంచి భారీ శబ్ధాలతో బ్యాండుమెళాలు మోగించారు. మళ్లీ కిందకి దిగి క్రమంలో భారీ స్వాగతం పలికి ఇది బరాత్‌ అనేలా చేశారు. ఈ తతంగం అంతా రిపోర్ట్‌ చేయడానికి ఓ రిపోర్టర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. వివాహం మొదలుకొని హెలికాప్టర్‌ వచ్చే తీరు వరుడి స్పందన, వధువు రియాక్షన్‌ తదితర అంశాలన్నీ ఆ రిపోర్టర్‌ కవర్‌ చేశాడు. ‘కొడుకు సంతోషాన్ని మించింది ఏదీ లేదని కుమారుడి కోసం తండ్రి చేసిన ప్రయత్నం’ అనే కామెంటరీతో ఈ వీడియో వైరల్‌ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version