పబ్లిక్ టాయిలెట్స్‌లో భద్రత కోసం.. తలుపులకు సంబంధించి తీసుకునే జాగ్రత్తలు ఇవే..!

-

సహజంగా ఖాళీ సమయంలో అందరూ హోటళ్లకు, థియేటర్లకు, మాల్స్ కు వెళ్ళడానికి ఇష్టపడతారు. అయితే అటువంటి ప్రదేశాలలో ఉండేటువంటి టాయిలెట్స్ కు సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అందుకే ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. మాల్స్ లో, థియేటర్స్ లో ఉండే టాయిలెట్ కు సంబంధించిన తలుపులు కింద నుంచి తెరిచి ఉంటాయి. ఈ విధంగా సగం ఓపెన్ అవుతూ ఉంటాయి. అయితే దీని వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. ఇంట్లో టాయిలెట్స్ కు ఉండేటువంటి తలుపులు మాత్రం వేరేగా ఉంటాయి, అవి పూర్తిగా మూసుకుపోతాయి.

కాకపోతే బయటకు వెళ్ళినప్పుడు కొత్త ప్రదేశాలలో టాయిలెట్ కు వెళ్లి అకస్మాత్తుగా ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడినా వారిని బయటకు తీసుకురావడానికి ఇటువంటి తలుపులను ఉపయోగిస్తారు. అంతేకాకుండా మాల్స్ లో పిల్లలు కూడా టాయిలెట్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వారికి తలుపు తీయడం రాకపోతే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అటువంటి సందర్భాలలో ఇలాంటి తలుపులు ఎంతో సహాయం చేస్తాయి అని చెప్పవచ్చు. పబ్లిక్ టాయిలెట్స్ లో తలుపులు కింద నుండి తెరిచి ఉండడం వలన టాయిలెట్స్ లో స్మోక్ చేసినా పొగ బయటకు వెళ్ళిపోతుంది. బహిరంగంగా సిగరెట్లు తాగడం నేరం, అయినా సరే కొంతమంది పాటించరు.

అలాంటప్పుడు టాయిలెట్స్ పూర్తిగా మూసుకుపోయి ఉంటే చాలా ప్రమాదకరమని ఈ విధంగా తలుపులను తెరిచి ఉంచుతారు. అంతేకాకుండా టాయిలెట్స్ ను శుభ్రం చేయడానికి కూడా సులభంగా ఉండడానికి తలుపులు సగం ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. పైగా పబ్లిక్ టాయిలెట్స్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక శుభ్రం చేయడానికి ఇది ఒక సులభమైన మార్గం. చాలా శాతం మంది మాల్స్ కు, సినిమాలకు ఎక్కువగా వెళుతూ ఉంటారు పైగా కొంతమంది అయితే పబ్లిక్ టాయిలెట్స్ లో అశ్లీల పనులు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాటిని నివారించడానికి పబ్లిక్ టాయిలెట్స్ లో తలుపులను కింద తెరిచి ఉంచుతారు. ఈ విధంగా ఇటువంటి వాటిని నివారిస్తారు. అందుకే పబ్లిక్ టాయిలెట్స్ తలుపులను ఈ విధంగా రూపొందిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news