మందుబాబులకు షాక్.. ఆరోజు హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్

-

హైదరాబాద్ లోని మందుబాబులకు నగర కమిషనర్ సీవీ ఆనంద్ షాక్ ఇచ్చారు. ఈనెల 12వ తేదీన నగరంలోని వైన్ షాపులన్నీ బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలన్నీ మూసివేయాలని ఆదేశించారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని సూచించారు.

మద్యం దుకాణాలు మాత్రమే కాదు.. కల్లు కాంపౌండ్ లు, బార్‌లు కూడా మూసివేయాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. జంటనగరాల్లో ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య హనుమాన్ జయంతి జరుపుకోవాలని సీపీ సూచించారు. పండుగ పూట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్​ 6వ తేదీన కూడా రాష్ట్రవ్యాప్తంగా వైన్​ షాపులను మూసివేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news